విజయవాడ

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గృహ నిర్మాణ శాఖాధికాలను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద 88వేల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా ఇంతవరకు 57 ఇళ్లు నిర్మించామని, మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో టిడ్కో ద్వారా 96,138 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 31,424 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభించిన గృహ నిర్మాణ లబ్ధిదారులను అధికారులు కలిసి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ-2 పీ బాబూరావు, సబ్ కలెక్టర్ మిషాసింగ్, టిడ్కో అధికారి చిన్నోడు, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
విజయవాడ పశ్చిమ, జూన్ 17: పశ్చిమంలోని చిట్టినగర్‌లో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం దేవస్థానం నుండి ఊరేగింపుగా కృష్ణానదీ తీరానికి బయలుదేరారు. పురవీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. నది నుండి బిందెలతో పవిత్ర కృష్ణా జలాలు తీసుకొచ్చారు. మేళతాళాలతో సాగిన ఈ సహస్ర కలశయాత్రకు భక్తులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కలశాలు ఆలయ ప్రాంగణంలోకి తెచ్చాక వేదమంత్రాలతో ఉత్సవమూర్తులకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవారిని పెండ్లికుమారుని చేశారు. ఈ ఉత్సవాలు పౌర్ణమి రోజు ప్రారంభం కావడంతో వేలాది మంది శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం విష్వక్సేన పుణ్యాహ వచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, దీక్షాచరణ, కంకణధారణ, గరుడా ఆరాధనము, పూజాదికాల అనంతరం తీర్థప్రసాదాలు పంచారు. ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ రత్నమాచార్యులు, పర్యవేక్షణలో సహాయ అర్చకులు పులిపాక సాయి పూజాదికాలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు పోతిన బేసికంఠేశ్వరుడు, గౌరవాధ్యక్షుడు బాయన మూర్తి, కార్యదర్శి రుూది ఎల్లా రాజారావు, ఉపాధ్యక్షుడు రుూది ఎల్లారావు, సహాయ కార్యదర్శులు తోత్తడి భరత్‌కుమార్, గూడేల వెంకటరమణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బైపిళ్ళ ముత్యాలరావు, కోశాధికారి బోగవల్లి శ్రీ్ధర్, కార్యవర్గ సభ్యులు రాయన ఆదిబాబు, శీరం వెంకటరావు భక్తులకు సౌకర్యాలు పర్యవేక్షించి సేవలు అందించారు.