విజయవాడ

ఫైనల్స్‌కు చేరిన ఆలిండియా పోస్టల్ బ్యాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 11: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో స్థానిక దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 34వ అలిండియా పోస్టల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్‌తో పాటు వెటరన్ సింగిల్స్ పోటీలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శాంతిస్వరూప్ (హిమాచల్‌ప్రదేశ్)పై 21-3, 21-8 తేడాతో అంకిత్ ఆరోరా (రాజస్థాన్), చంద్రన్‌జాదవ్ (మహారాష్ట్ర)పై 21-12, 21-7 తేడాతో అమిత్‌శర్మ (డిల్లీ), అంకిత్‌మాలిక్ (హార్యానా)పై 22-20, 21-9 తేడాతో ప్రమోష్ (మధ్యప్రదేశ్), హెచ్‌బి సోనీ (గుజరాత్)పై 21-19, 21-9 తేడాతో రంజిత్‌సన్ని (కేరళ)లు గెలుపొంది సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్స్‌లో అమిత్‌శర్మ (్ఢల్లీ)పై 21-16, 21-4 తేడాతో అంకిత్ ఆరోరా (రాజస్థాన్), రంజిత్ సన్ని (కేరళ)పై 21-13, 21-12 తేడాతో ప్రమోష్ (మధ్యప్రదేశ్)లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోప్రియన పాటెల్ (గుజరాత్)పై 21-16, 21-6 తేడాతో లీలాలక్ష్మీ (కర్నాటక), మోహర్‌మాలముఖర్జీ (పశ్చిమబెంగాల్)పై 21-19, 21-10 తేడాతో మేఘ (అస్సాం), కోమల్ (హార్యానా)పై 21-6, 21-10 తేడాతో ఎం అరుణ (తమిళనాడు), ఎస్ రోసిలీనాబేగం (అస్సాం)పై 5-21, 21-14, 21-7 తేడాతో వైశాలీ (గుజరాత్)లు విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. సెమీ ఫైనల్స్‌లో లీలాలక్ష్మీ (కర్నాటక)పై 21-17, 21-9 తేడాతో మేఘ (అస్సాం), ఎం అరుణ (తమిళనాడు)పై 21-14, 21-12 తేడాతో వైశాలీ (గుజరాత్)లు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. వెటరన్ సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో ఎ సేల్వారాజ్ (తమిళనాడు)పై 21-9, 21-9 తేడాతో జార్జ్ (కేరళ), ఖాజేన్ (అస్సాం)పై 21-7, 21-7 తేడాతో బిశ్వాస్ (పశ్చిమబెంగాల్)లు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు.

భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా విద్యాధర్
విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 11: చైనాలో ఈ నెల 20నుండి 28వరకు జరగనున్న ఏషియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జూనియర్ బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా నగరానికి చెందిన జేబీఎస్ విద్యాధర్ నియమితులయ్యారు. భారత జట్టుకు కోచ్‌గా విద్యాధర్ నియమితులైనట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ ఎంకె సింగ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యాధర్‌ను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

దుర్గమ్మ సేవలో మంత్రి శంకరనారాయణ
ఇంద్రకీలాద్రి, జూలై 11: ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను గురువారం వేర్వేరు సమయాల్లో పలువురు వీఐపీలు దర్శనం చేసుకున్నారు. అనంతరం వీరికి ఈవో వి కోటేశ్వరమ్మకు అమ్మవారి చిత్రపటం, క్యాలెండర్, ప్రసాదాలు అందచేశారు. తొలుత వీరికి రాజగోపురం వద్ద అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ దంపతులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల-తిరుపతి దేవస్థానం జేఈవో ఏవీ ధర్మారెడ్డి, తుడా చైర్మన్, శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దర్శనం చేసుకున్నారు.