విజయవాడ

వార్డు వలంటీర్ అభ్యర్థులకు స్లాట్ ప్రకారం ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 11: నగర పరిధిలో వార్డు వలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్టు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈమేరకు గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఇంటర్వ్యూల ప్రక్రియను పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా ఒకరోజు ముందుగా ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుందని, ఎస్‌ఎంఎస్‌లో పేర్కొన్న స్లాట్ ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు వలంటీర్ల ఎంపికకు సంబంధించి నగర వ్యాప్తంగా 59డివిజన్లకు 5648 పోస్టులు మంజూరు కాగా, వీటికి 5250 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరి అర్హతను బట్టి ఇంటర్వ్యూల ప్రక్రియ జరుగుతుందని, ఒక్కో అభ్యర్థిని ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ చేస్తుండగా మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు అందిన సమాచారం ప్రకారం స్లాట్ సమయానికి అనుగుణంగా ఏ కమిటీ వద్దకు ఎలా వెళ్లాలన్న సమాచారం తెలుస్తుందన్నారు. ఈ నెల 25వరకూ ఆన్‌లైన్ ద్వారా వచ్చిన 5250 మందికి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. గురువారం మొత్తం 405 మంది అభ్యర్థులకు సమాచారం అందగా వీరిలో 283 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారని, 25వ తేదీ తరువాత డీఎంఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారి మార్కులు ప్రకటిస్తామని ఆయన వివరించారు.

ఫసల్ బీమా ప్రయోజనం
ప్రతి రైతుకూ అందాలి
కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్
విజయవాడ (కార్పొరేషన్), జూలై 11: ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా ప్రయోజనం అందాలని, అర్హతను బట్టి రైతులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై గురువారం నగరంలోని క్యాంప్ కార్యాయలంలో జిల్లాస్థాయి కమిటీ చైర్మన్, కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు పంట కోల్పోయిన రైతును ఆర్థికంగా ఆదుకుని స్నేహపూరిత ప్రయోజనం కల్పించేలా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 2016 ఖరీఫ్ నుంచి అమలులో ఉన్న కృష్ణా జిల్లాలో రైతులపై ఎలాంటి భారం పడకుండా వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ ఏడాది నుంచి రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు కేవలం ఒక్క రూపాయి చెల్లించి నిర్దేశిత గడువులోగా రైతులు తమ పంటలకు బీమా పొందవచ్చన్నారు. పంటల బీమాలో చేరేందుకు వరి పంటకు ఈ ఏడాది ఆగస్టు 21లోగా, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని, పథకం అమలుకు జిల్లాలో ఇఫ్కొ టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఖరీఫ్‌లో 22పంటలు, రబీ 2019-20లో పది పంటలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీనిలోభాగంగా ఖరీఫ్‌లో వరి, మొక్కజొన్న, పెసర, కంది, మిర్చి, పత్తి, వేరుశనగ, చెరుకు వంటి 9రకాల పంటలకు ఫసల్ బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల విత్తలేకపోయినా, నాట్లు వేయలేకపోయినా, కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25శాతం వరకూ సత్వరమే పరిహారం చెల్లింపు ఉంటుందని, స్థానిక విపత్తుల కారణంగా పంట పొలాలు నీట మునిగినా, వడగండ్లు వాన, మట్టిపెళ్లలు విరిగిపడినా పిడుగుపాటు, అగ్నిప్రమాదం వంటి వాటికి కూడా పరిహారం ఉంటుందన్నారు. పంట కోతల తర్వాత ఆరబెట్టిన పంటలకు తుఫాన్, అకాల వర్షాలకు కూడా పరిహారం ఉంటుందని, పథకం ప్రయోజనాలను రైతులకు వివరించి, అవగాహన కల్పించాలన్నారు. రైతులంతా అర్హతను బట్టి ప్రయోజనం పొందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వివరించారు.