విజయవాడ

ఐదేళ్ల టీడీపీ పాలనలో గద్దె చేసింది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 15: తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో కేవలం పచ్చచొక్క వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అందించేవారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు ఆరోపించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ని అనుబంధం సంఘాల విభాగం కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్టూ డెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, ఎస్సీ సెల్ విజయవా డ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తోక ల శ్యామ్ కుమార్, బీసీ సెల్ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కో సగాని దుర్గారావు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ కార్యకర్త లు పోరాడాల్సిన సమయం వచ్చింద ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పి లుపునివ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె చేయలేదన్నారు. 30రోజుల్లోనే సీ ఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాల ను ఎక్కించ్చారన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే గద్దె కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేయడంతో పాటు ప్రజలను త ప్పదోవ పట్టిస్తున్నారని విమర్శించా రు.గత టీడీపీ ప్రభుత్వ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అసలు నిధులు కేటాయించలేదని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్ మాత్రం టీడీపీ 23మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఒక కోటి రూపాయల నిధులను కేటాయించడం కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి గత ప్రభుత్వంలో జరిగిన ఇటువంటి అభివృద్ధిని ఆయన ఖాతాలో వేసుకుంటూ కలర్ ఎమ్మెల్యేగా పేరు గడించారన్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు తూర్పు ని యోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎ మైనా ఉందంటే అది ఒక పచ్చచొక్కా వేసుకున్న వారు మాత్రమే అభివృద్ధి చెందారన్నారు. సామాన్య జనం ఎటువంటి అభివృద్ధి సాధించలేదన్నారు. మరికొన్ని రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో గద్దె హయాంలో చేశామని చెప్పుకుంటున్న ఎటువంటి అభివృద్ధి ఎప్పుడు జరిగింది, అనే విషయాన్ని సాక్షాధారాలతో సహాప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు.

స్పందనకు విశేష స్పందన
*గత వారం నాటి 47 అర్జీలలో 44 పరిష్కారం
విజయవాడ (కార్పొరేషన్), జూలై 15: ప్రజా సమస్యలే పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్పం దన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తోంది. ప్రజలు అందించిన అర్జీల పరిష్కారానికి వా రం రోజుల గడువు విధించిన వైనం తో ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఉత్సాహం చూపుతుండ టం విశేషం. సోమవారం వీఎంసీ కా ర్యాలయంలో జరిగిన స్పందనలో ప్ర జల నుంచి అర్జీలను స్వీకరించిన క మిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచనలు చేశారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 11, ఇంజినీరింగ్- 19, యూసీడీ-4, ఉద్యానవన శాఖ-3, పబ్లిక్ హెల్త్-5, ఎస్టేట్ సెక్షన్-2, విద్యాశాఖ-2, జోనల్ కమిషనర్-2, రెవె న్యూ-1, అడ్మినిస్ట్రేషన్-3 దరఖాస్తులు అందగా గతవారం ప్రజల నుంచి అం దిన మొత్తం 47 దరఖాస్తులలో 44 అర్జీలను పరిష్కరించినట్టు అధికారు లు తెలుపుతున్నారు. సోమవారం అం దిన అర్జీలలో ప్రధానంగా సూర్యారావుపేటలోని పీసపాటి వారి వీధిలో లె వెల్స్ ప్రకారం డ్రైన్ల నిర్మాణంతో దా టేందుకు పిల్లలు, పెద్దలు అసౌకర్యానికి గురవుతున్నారని, గవర్నర్‌పేటలోని పురాతన భవనాన్ని కూల్చివేసేందుకు అనుమతించాలని, సూర్యారావు పేటలో తరచూ పొంగిపొర్లుతున్న డ్రై న్లకు మరమ్మతులు చేపట్టాలని, ఫిర్యాదులు అందగా, బీసీ కార్పొరేషన్ ద్వా రా రుణం అందించాలని, వృద్ధాప్య పె న్షన్ మంజూరు చేయాలన్న అంశంతోపాటు విఎంసీ పాఠశాలలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని ఓ విద్యార్థి కమిషనర్‌కు అర్జీ అందించారు.