విజయవాడ

కమిషనరేట్ ‘స్పందన’కు 75 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 15: ప్రతి సోమవారం ప్రజాసమస్యలను నేరుగా విని పరిష్కరించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నగర పోలీసు కమిషనరేట్‌లో ‘స్పందన’కు విశేష ఆదరణ లభిస్తోంది. కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితుల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. పిటిషనర్లు నేరుగా పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావును కలిసి విఙ్ఞప్తులు, ఫిర్యాదులు అందచేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంతోపాటు కమిషనరేట్‌లోని జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్పందన నిర్వహించారు. కాగా తన దృష్టికి వచ్చిన 75 ఫిర్యాదులపై స్పందించిన సీపీ సత్వర పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీకరించిన 75 ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి 15 ఫిర్యాదులు, మరో 14 స్ధల వివాదాలు, మరో 14 భార్య భర్తలు, కుటుంబ కలహాలు, ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ ఎనిమిది ఫిర్యాదులు, ఐదు కపిల్ చిట్స్, సాయిలత చిట్స్, అనుమతి లేని చిట్స్ కేసులు, ఆరు దొంగతనాలకు సంబంధించి, మరో అద్దె వివదాలు, రెండు తప్పిపోయిన కేసులు, ఒక హోంగార్డు ఉద్యోగం కోసం, ప్రాణహాని ఉందని ఒక ఫిర్యాదు, ఇంటి పక్కవారితో తగాదాకు సంబంధించి ఒకటి, కేసు కట్టవద్దని బెదిరిస్తున్న కేసు ఒకటి, కట్టిన కేసులో త్వరగా ఛార్జిషీటు దాఖలు చేయాలని మరో ఫిర్యాదుకు సంబంధించి ఉన్నాయని వివరించారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్టేషన్లకు పంపి సత్వర పరిష్కారానికి ఆదేశించినట్లు తెలిపారు.

ఆరు నెలల గౌరవవేతనం, పారితోషకం బకాయిలు చెల్లించాలి
* ధర్నాలో హెల్త్ వర్కర్లు డిమాండ్

విజయవాడ, జూలై 15: గత జనవరి నుంచి ఆరు మాసాలుగా రావాల్సి ఉన్న గౌరవ వేతనం, పారితోషిక బకాయిలను తక్షణం చెల్లించాలని సోమవారం ధర్నా చౌక్‌లో సీఐటీయు అనుబంధ వలంటీర్ హెల్త్ వర్కర్స్ ‘ఆశ’ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో నేతలు డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో మహిళా వర్కర్లు తరలివచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ. 10వేలు వేతనాన్ని, పారితోషికాలతో ముడిపెట్టకుండా గౌరవ వేతనంలో చెల్లించాలని అధికారులు రాజకీయ నేతలు వేధింపులను అరికట్టాలని, యూనిఫాం, టీబీ, 104 బకాయి చెల్లించాలని, ప్రభుత్వ సంస్థల పథకాలన్నింటినీ ఆశా వర్కర్స్‌కు కూడా వర్తింపచేయాలన్నారు. ఈ సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ వెంకటేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాస్, వై నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.