విజయవాడ

వర్షం నీటి ముంపు నుంచి రహదారులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 15: చిన్నపాటి వర్షానికి ముంపునకు గురైయ్యే నగర రహదారులకు విముక్తి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు అంచనాలను సిద్ధం చేయాలన్న ఆయన సోమవారం నగర పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పలు సమస్యలను పరిశీలించారు. వన్‌టౌన్‌లోని ఆర్‌ఆర్ అప్పారావు వీధి, విన్నకోట వారి వీధి, సుబ్బరామయ్య వీధి, గీతా మందిరం వీధి, కాళేశ్వరరావు మార్కెట్ తదితర ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ జన నివాస యజమానులందరూ తమ ఇళ్లకు యూజీడీ కనెక్షన్ తీసుకుంటే రోడ్ల అభివృద్దికి అవకాశం ఉంటుందని స్థానికులకు సూచించారు. గణపతిరావు రోడ్డులో నిల్వ ఉన్న నీటితో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా వీక్షించిన వారు నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రతి రోజు డ్రైన్ పొంగి పొర్లి రోడ్డుపైకి మురుగునీరు, వర్షంనీరు నిలిచి నిరంతరం సమస్యగా ఉత్పన్నమవుతోందని, బీఆర్‌పీ రోడ్డులో చేపట్టిన ప్రత్యామ్నాయ డ్రైన్ వస్తల్రత వద్ద నిర్మాణం నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ప్రజల వద్ద నుంచి అనేక ఫిర్యాదులొస్తున్నాయని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కమిషనర్ వెంకటేష్‌కు సూచించగా అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గీతా మందిరం రోడ్డు కల్వర్టు స్లాబ్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో పలువురు వీఎంసీ అధికారులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.