విజయవాడ

రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికుల అంశంపై సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కందూరు నాగార్జునరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వం రేషనలైజేషన్ కింద ఆరు వేలకుపైగా పాఠశాలలను మూసివేసిందన్నారు. దీనిపై పరిశీలన చేస్తామన్నారు. మంచినీరు, ప్రహరీగోడలు, మరుగుదొడ్లు ఇతర వౌలిక సదుపాయాల కోసం ఈ ఏడాది అధిక నిధులు కేటాయించామన్నారు. సెర్ప్ ద్వారా జీతాలు చెల్లించకపోతే పారిశుద్ధ్య కార్మికులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముస్త్ఫా, అచ్చెన్నాయుడు, వెంకటేష్, శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ వౌలిక సదుపాయాల పేరిట కోట్లాది రూపాయల వ్యయంతో దాఖలైన టెండర్లపై ఉన్న శ్రద్ధ మరోదానికిపై లేదని అచ్చెన్నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.