విజయవాడ

ఇళ్ల పట్టాలపై రాజకీయం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూలై 16: నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ ప్రభుత్వం జారీ చేసినవి ఉత్తుత్తి జీవోలని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో వైకాపా శాసనసభ్యుడు మల్లాది విష్ణు విమర్శించటాన్ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తివి ఉండవన్నారు. చట్టపరంగా చేసిన జీవోలను మంచి, చెడు అని రెండు రకాలుగా విభజించటం చట్టాన్ని ధిక్కరించటమేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మంత్రివర్గ ఉపసంఘం వేసి అనేకమైన చర్చలు జరిపిందన్నారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎసైన్డ్ భూములతో కలిపి ఒక సమగ్ర బిల్లు తయారు చేసిందన్నారు. వాటిద్వారా రూపొందించిన జీవోలను ఉత్తుత్తి జీవోలనే అపవాదు వేసి తప్పించుకోవం భావ్యం కాదన్నారు. విజయవాడ, తిరుపతి, వైజాగ్ వంటి నగరాల్లో అనేక మంది పేదలు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని టీడీపీ ప్రభుత్వం జీవోల్లో పేర్కొందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేనాటికి సుమారు 9వేల ఇళ్లకు పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. వాటన్నింటినీ తక్షణమే ఇప్పించాల్సిందిగా గద్దె కోరారు.