విజయవాడ

అనంతపురం జేఎన్‌టీయుకి నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: అనంతపురం జేఎన్‌టీయు కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు కొనసాగింపునకు రావాల్సిన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. గత కొంతకాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదని, ఫలితంగా ఈ కాలేజీలో వివిధ విభాగాల్లో 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయనందు వలన ఈ కాలేజీకి ఉన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ (ఎన్‌బీఏ) రద్దయ్యే ప్రమాదం వచ్చిందన్నారు. జేఎన్‌టీయు కళాశాల సౌకర్యాలు, ప్రయోగశాలలు, విశాల ప్రాంగణం, క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రైవేటు కాలేజీల కన్నా ముందు భాగాన ఉన్నదని, అయినప్పటికీ ప్రైవేట్ యూనివర్శిటీలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ విధానం జేఎన్‌టీయు మనుగడను ప్రశ్నార్థకం చేసిందన్నారు. దీని కన్నా తక్కువ సౌకర్యాలున్న ప్రైవేట్ కాలేజీలకు ఎన్‌బీఏ, నాక్ గుర్తింపు ఇచ్చి జేఎన్‌టీయుకు ఇవ్వకపోవడం సరికాదన్నారు.