విజయవాడ

ఎస్సీ వర్గీకరణపై జగన్ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: ఎస్సీ వర్గీకరణతో దళితుల మధ్య చంద్రబాబునాయుడు చిచ్చురగిల్చారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించడాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఎస్సీల్లో మాల, మాదిగలకు వర్గీకరణతో సమ న్యాయం చేశారన్నారు. 2000 - 04 టీడీపీ పాలనలో వర్గీకరణ వలన ఎంతో మంది మాదిగలు, మాదిగ ఉపకులాలు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్నారు. ఉన్నత విద్య నభ్యసించారన్నారు. వైఎస్ హయాంలో వర్గీకరణపై సుప్రీం కోర్టులో సరైన వాదన వినిపించలేకపోవడం వలన సంబంధించిన పిటిషన్ వీగిపోయిందన్నారు. దళితుల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైఖరి ఏమిటని ప్రశ్నించారు. జగన్ మాదిగలను కించపరిచేలా మాట్లాడారన్నారు. దళితుల ఓట్లతో గెలిచి మరల వారిని కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో ఎగతాళి చేసి మాట్లాడటం సరికాదని, ఇది జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.