విజయవాడ

ఘనంగా ముగిసిన శాకంబరీదేవి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 16: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ప్రారంభమైన శ్రీశాకంబరీదేవి మహోత్సవాలు మంగళవారం సాయంత్రం అత్యంత వైభవోపేతంగా ముగిసాయి. శ్రీ వికారి నామ సంవత్సర ఆషాడ శుద్ధ త్రయోదశి రోజైన ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి రోజైన మంగళవారంతో ముగిసాయి. ఈసందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఆలయ స్ధానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు దేవస్ధానం ఈవో వీ కోటేశ్వరమ్మ చేత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శాకంబరీదేవిగా ప్రత్యేక అలంకారంతో శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. మంగళవారం సాయంత్రం నుండి గ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేతను దృష్టిలో పెట్టుకొని భక్తులు వేకువ జాము నుండే ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ప్రూట్స్ ఆభరణాలుగా ధరించి ఆషాడ మాసంలో భక్తులకు ప్రత్యేక అలంకారంతో అమ్మవారు దివ్య దర్శనం ఇచ్చింది. దాతల నుండి సేకరించిన వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, డ్రై పూట్స్, వాటితోపాటు నిమ్మకాయలు, అరటికాయలు, కరివేపాకు, తదితర వీటితో ఆలయ సిబ్బంది అమ్మవారి మూల విరాట్‌తోపాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని ఉపాలయాలు, అమ్మవారి సన్నిధి, విమాన ప్రాకారం, రాజగోపురం, శ్రీ మల్లికార్జున మహామండపంలోని ఉత్సవ మూర్తి, ఆలయ ప్రాకారం, ఘాట్‌రోడ్‌లోని శ్రీ కామధేన్ అమ్మవారి సన్నిధి, తదితర వాటిని పూర్తిస్ధాయిలో వీటితోనే అలంకరించటంతో అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తులు ప్రకృతి ఒడిలోనికి ప్రవేశించిన అనుభూతిని పొందారు. అంతరాలయంలోని మూల విరాట్‌ను దర్శనం చేసుకున్న భక్తులు అనంతరం శ్రీ మల్లికార్జున మహామండపంలోని ఉత్సవ మూర్తిన్ని దర్శనం చేసుకోనే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కదంబం ప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. వేకువ జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. మంగళవారం ఐఏఎస్ అధికారిణి బీ ఉదయలక్ష్మి శాకంబరీదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు పార్టీలకు చెందిన నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన పలువురు ఉన్నతస్ధాయి అధికారులు శాకంబరీదేవిని దర్శనం చేసుకున్నారు. ఇందులోభాగంగా గురుపూజ మహోత్సవం సందర్భంగా దేవస్ధానంలో దర్బాకుల గురునాథ ఘనాపాఠీ దంపతులను ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో అలయ అర్చకులు అత్యంత ఘనంగా సత్కరించారు.