విజయవాడ

వైకాపా పాలన అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: రాష్ట్రంలో వైకాపా పాలన అస్తవ్యస్తంగా ఉందని, జగన్ ప్రభుత్వ తీరుపై సామాన్య ప్రజలు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిన సందర్భంగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన ఉదయం 5.30 గంటల సమయంలో డివిజన్‌లలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అయ్యప్పనగర్ పరిసర ప్రాంత వాకర్స్‌ను కలిసి స్థానిక సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా 10, 11 డివిజన్‌లకు సంబంధించి పలువురు వాకర్స్ ఆయనను స్థానిక సమస్యలు తెలియజేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ప్రతి రోజూ డివిజన్‌లోని సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక నాయకులతో కలిసి పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. వారి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బోయన పట్రయ్య, విశ్వనాథపల్లి చిన్ని, శాయన బుజ్జి, బొర్రా రామ్మోహన్, మాగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీఈఓలకు గ్రామ సచివాలయ
ఉద్యోగులుగా నియమించాలి

విజయవాడ, జూలై 18: రాష్ట్ర వ్యా ప్తంగా ఆందోళన చేస్తున్న వ్యవసాయ ఉద్యానవన శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీఈఓలతో ప్రభుత్వం సత్వరమే చర్చలు జరిపి వీరికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగలుగా నియమించేందు కు తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రా మకృష్ణ గురువారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ ద్వా రా ఇంటర్వ్యూలు నిర్వహించి రోస్టర్ విధానం ద్వారా వ్యవసాయ, ఉద్యానవ న శాఖల్లో 5,764 మందిని బహుళ ప్ర యోజన విస్తరణాధికారులుగా (ఎంపీఈవో) నియమించడం జరిగిందన్నా రు. వీరిని తొలగించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో ఎంపీఈఓలు తీవ్ర క లత చెందుతున్నారని, తమకు న్యా యం చేయాలని కోరుతూ రెండు రో జులుగా ఏపీ స్టేట్ హార్టికల్చర్ అండ్ అ గ్రికల్చర్ ఎంపీఈఓల అసోసియేషన్ ఆధ్వర్యాన దీక్షలు చేస్తున్నారన్నారు.