విజయవాడ

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, జూలై 18: విజయవాడకు చెందిన నర్తన కూచిపూడి ఆర్ట్స్ అకాడ మీ ఆధ్వర్యంలో గురువారం త్రివేణి ఘాట్ దగ్గర గంగాహారతి సమయం లో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ నెల 14 నుంచి 27 వరకు రుషికేష్‌లో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఆహూతులను అలరించాయి. ఇంతవరకూ కేదార్‌నాథ్ చరిత్రలో ఎవరూ నృత్య ప్రదర్శన చేయలేదని సమాచారం. తొలిసారిగా విజయవాడకు చెందిన మద్దాలి సాయిచంద్రిక శిష్య బృందానికి ఆ ఘనత దక్కింది.

వలంటీర్ అభ్యర్థులకు పారదర్శకంగా ఇంటర్వ్యూలు
*డీపీవో రవీంద్ర
కంకిపాడు, జూలై 18: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వలంటీ ర్ల నియామకానికి ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పం చాయతీ అధికారి రవీంద్ర అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో గొడవర్రు, కోలవెన్ను గ్రామ దరఖాస్తుదారులకు నిర్వహస్తున్న ఇంటర్వ్యూలకు ఆయన హాజరయ్యారు. కొందరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం రవీంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో త్వరలో ని యమించనున్న వలంటీర్ల ద్వారా ప్రజలకు ఉన్నతమైన సేవలు అందుతాయన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ల్లో ప్రతి 50 కుటుంబాల అవసరాలు తెలుసుకుని వారికి పూర్తి న్యాయం చే యటానికి వీరిద్వారా అవకాశం ఉం టుందన్నారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా గ్రామ పంచాయతీల్లో వంటీర్లను ని యమించటానికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో ఆగస్టు 15నుంచి వలంటీర్ల వ్యవస్థ అమలులో కి వస్తుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో అనూరాధ, తహసీల్దార్ సతీష్, ఈవోపీఆర్‌డీ దు ర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.