విజయవాడ

భూగర్భ జలాల పెంపుదలకు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, జూలై 18: జిల్లాలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా ముసునూరు మండలాన్ని ఎంపిక చేసి భూగర్భ జలాల పెంపుదలకు ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం జలశక్తి అభియాన్ అమలుపై ఉప బ్లాక్ నోడల్ ఆఫీసర్ (కొత్త ఢిల్లీ) వివేక్, టెక్నికల్ ఆఫీసర్ (హైదరాబాద్) కర్బన్‌తో కలిసి ఈ పథకం అమలు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నాటికి భూగర్భ జలమట్టం 82.97 మీటర్ల లోతుకు పడిపోయిందని, గత పదేళ్ల కాలంలో 50 నుంచి 61 మీటర్ల లోతుకు భూగర్భ జలస్థాయి అడుగంటిపోయిందని తెలిపారు. జలశక్తి అభియాన్ ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు ముసునూరు మండలంలో ఐదు కార్యక్రమాలు చేపట్టామన్నారు. నీటి సంరక్షణ, వర్షపునీటి పనులు, పరీవాహక పనులు చేపట్టడం ద్వారా చెక్‌డ్యామ్ నిర్మాణం, రైతుల పొలాల్లో పంట కుంటల తవ్వకం, ఊట కుంటలు, చిన్న ఊట కుంటల తవ్వకం, ఖండిత కందకాల తవ్వకం, సంకన్ పిట్ల ఏర్పాటు కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. భూసార పరిరక్షణ పనుల్లో భాగంగా భూసారం, తేమ పరిరక్షణకు కందకాల ఏర్పాటు చర్యలు చేపడతారన్నారు. సంప్రదాయ జలవనరుల పునరుద్ధరణలో భాగంగా చెరువుల్లో పూడిక తీయటం, ఆక్రమణలు తొలగించటం, చెరువుగట్లు బలపర్చే చర్యలు చేపడతామని చెప్పారు. రీచార్జి నిర్మాణాల్లో భాగంగా బావులు నింపే పనులు, ఇంటింటా ఇంకుడు గుంతలు తీయటం, పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో వర్షపునీరు నీల్వ చేయటం ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు చర్యలు చేపట్టామన్నారు. అడవుల సంరక్షణలో భాగంగా పండ్లతోటల పెంపకం, రోడ్డుకు ఇరువైపులా, పెరట్లలో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో, సరిహద్దు పొలం గట్లపై, కమ్యూనిటీ స్థలాల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.