విజయవాడ

చినుకు పడితే చిత్తడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూలై 20: ఒక మోస్తరు వర్షం పడితే చాలు నగరంలోని అనేక రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. డ్రైన్లు పొంగిపొర్లి రోడ్లను ముంచెత్తుతున్నాయి. ప్రతి ఏటా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా దృశ్యాలు పరిపాటిగా మారాయి. వర్షాకాలం వస్తోందనే ముందుచూపు నగర పాలక సంస్థ అధికారులకు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నగరవాసులు వాపోతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాల్వల్లో పూడికలు తీయించడం, రోడ్ల మరమ్మతు పనులు చేయడం వంటి పనుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో డ్రైన్లు పొంగిపొర్లి రోడ్లను చెరువుల్లా మారుస్తున్నాయి. ముఖ్యంగా మొగల్‌రాజపురంలోని పలు ప్రాంతాలు, కృష్ణలంక, అజిత్‌సింగ్‌నగర్, నూజివీడు రహదారి, తదితర ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. ఇక భారీ వాహనాలు వెళ్లే సమయంలో మురుగునీరు చిమ్మి పక్కన వెళ్తున్న వాహనదారులపై పడుతున్న సందర్భాలు కోకొల్లలు. మురుగునీరు రోడ్లను ముంచెత్తడం వల్ల అనేక రహదారులు దెబ్బతిని గతుకుల మయంగా మారాయి. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు రహదారుల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం
ఇబ్రహీంపట్నం, జూలై 20: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలో శనివారం ఖాజీమాన్యం ప్రాంతంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. గాజులపేట, జలగలపేటలో వర్షపు నీరు నిలిచిపోయింది. రామానగర్, ఆంజనేయ కాలనీ, జూపూడి గ్రామంలోని భీమేశ్వర కాలనీలోని పల్లపు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. ఖాజీమాన్యంలో రోడ్డుపై నీరు నిలిచిపోవటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.