విజయవాడ

ఎస్సీ వర్గీకరణ కేంద్రం పరిధిలోని అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూలై 20: ఎస్సీల అభ్యున్నతికి రాష్ట్రంలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే గతంలో లేని విధంగా మాదిగలకు ఓ కార్పొరేషన్, రెండు మంత్రి పదవులను కూడా కల్పించారని బాపట్ల వైసీపీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీల వర్గీకరణ కేంద్ర పరధిలోని అంశమన్నారు. వర్గీకరణ కోసం ఆందోళనలు చేయడం మంచిది కాదన్నారు. ఎస్సీల సంక్షేమాన్ని అడ్డుకునే విధంగా మంద కృష్ణమాదిగ చర్యలు ఉన్నాయన్నారు. కృష్ణమాదిగ వెనుక రహస్య చంద్రుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల అభ్యున్నతికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కృష్ణమాదిగ పోరాడుతుంటే దాని వలన అత్యధికంగా లబ్ధి పొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేనన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం 50 రోజులు మాత్రమే అయ్యిందని, వెంటనే వర్గీకరణ సమస్యపై నిర్ణయం తీసుకోవాలంటూ ఒఅల్టిమేటం జారీ చేయడం దారుణమన్నారు. ఎస్సీలు ఎక్కడ బాగుపడతారో అనే భయం ఏర్పడినట్లుగా కనిపిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజికంగా మాదిగలకు ప్రాధాన్యత కల్పించిన విషయం గుర్తించాలన్నారు. రాత్రికి రాత్రి ఇక్కడకు వచ్చి హడావుడి చేసి ఎమర్జెన్సీని తలపించేలా నిర్ణయాలు తీసుకోవడం ఏంటన్నారు. ఎస్సీలకు మేలు చేసే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చే విధంగా గ్రామవాలంటీర్లలో కూడా 50 శాతం ఇచ్చే విధంగా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నట్లు చెప్పారు. గతంలో జగన్ పాలన బాగుందని తెలంగాణలో కృష్ణమాదిగ కితాబిచ్చిన విషయాన్ని సురేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ గురించి తేడాగా మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులను ఏవిధంగా బాగుచేయాలో జగన్‌కు బాగా తెలుసన్నారు. ఈనెల 22 నుండి ఆందోళన మొదలు పెడతాం అంటూ కృష్ణమాదిగా ప్రకటించటం దురదృష్టకరమన్నారు. అనుభవం ఉన్న కృష్ణమాదిగ మంచి పనులకు అండగా ఉండాలన్నారు. దళితులను మొదటి నుండి గౌరవిస్తుంది ఒక్క వైసీపీ మాత్రమేనన్నారు. అవసరమైయితే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తాం, ఒక్కసారి వచ్చి సీఎంతో చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినాక మాట్లాడదాం అంటే దానికి ఒప్పకోకుండా ధర్నాలు, పాదయాత్రలు, బంద్‌లు చేయటం అంటే ప్రజలను వెర్రివారిని చేయడం తప్ప మరొకటి కాదన్నారు. గత మూడు దశాబ్దాలుగా దళితులను అన్ని విధాలుగా వాడుకుని వదిలేశారే గాని, వారి అభివృద్ధిని పట్టించుకున్న వారే లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండ దొరికిందని స్వయంగా చెప్పిన కృష్ణమాదిగ ఈ రోజు జగన్‌పై నిందలు మోపడం సరైన విధానం కాదన్నారు. అసలు ముందు మీ వైఖరి ఎంటో ప్రజలకు చెప్పాలన్నారు. కృష్ణమాదిగ వైఖరి వల్ల దళితులను ఇక బాగుపడనివ్వరేమో అనే భయం కలుగుతోందన్నారు. వర్గీకరణ అనే అంశం కేంద్రం పరిధిలోనిది అనే విషయాన్ని అందరూ గ్రహించాలని సురేష్ కోరారు.