విజయవాడ

విద్యా రంగంలో సంస్కరణలపై నాలుగు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 20: విద్యావ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై స్టేక్ హోల్డర్స్‌తో చర్చించిన తరువాత ప్రభుత్వానికి నాలుగు నెలల్లో నివేదిక అందించనున్నామని విద్యావ్యవస్థ సంస్కరణలపై నిపుణుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణన్ తెలిపారు. నగరంలోని హోటల్ గేట్‌వేలో శనివారం ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఎడ్యుకేషనల్ రిఫామ్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో బాలకృష్ణన్ మాట్లాడుతూ విద్యాశాఖలో ఎలాంటి సంస్కరణలు తేవాలన్న విషయంపై పలువురు ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారన్నారు. ప్రధానంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడుకున్న విద్య ఉందంటూ కమిటీ దృష్టికి కొద్దిమంది ప్రతినిధులు తెచ్చారని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంతో పాటు రాష్ట్రంలో కామన్ విద్యా విధానాన్ని తీసుకొచ్చే దిశగా కమిటీ కృషి చేయాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరాయని తెలిపారు. ప్రైవేట్ విద్యా విధానం ప్రభుత్వ విధానానికి తోడ్పాటు అందించేలా ఉండాలని కొద్దిమంది తమ అభిప్రాయాలను తెలియజేశారన్నారు. డిగ్రీ విద్యార్థులతో సమావేశమైనప్పుడు ప్రాథమిక స్థాయిలో సరైన విధంగా విద్య ఉంటే ఉపయోగపడుతుందని తెలిపారన్నారు. ప్రతి విద్యార్థి ఆడుతూపాడుతూ చదువుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యావ్యవస్థలో పర్యవేక్షణ లోపం కూడా కనిపిస్తోందన్నారు. కమిటీ దృష్టికి వచ్చిన విషయాలను అంతర్గతంగా సభ్యులతో చర్చించి నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నెలల్లో అందిస్తామని ఆయన వివరించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కె సంధ్యారాణి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.