విజయవాడ

అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత తీరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 20: అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత త్వరలోనే తీరుస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైర్ స్టేషన్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలో కోటీ 53 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకువస్తున్నారన్నారు. అదేవిధంగా ఓఎన్‌జీసీ వంటి గ్యాస్ ప్రాజెక్టులు ఉన్న చోట కూడా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదైనా సంఘటన, విపత్తు సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం ఫైర్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు, అదేవిధంగా అగ్నిమాపక శాఖలో ప్రస్తుతమున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, సిబ్బంది కొరతను త్వరలో తీరుస్తామన్నారు. అదేవిధంగా ఖాళీలనుకూడా భర్తీ చేస్తామని చెప్పారు. గతంతో పోలిస్తే అగ్నిప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, కానీ పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రతి జనవరిలో కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఒక ఫైర్ స్టేషన్ నిర్మాణానికి రెండుకోట్ల వరకు ఖర్చు అవుతుందని, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఆర్‌ఎం కిషోర్‌కుమార్, ఫైర్ డీజీ ఏఆర్ అనురాధ, పిటిఓ ఐజి కె సత్యనారాయణ, ఫైర్ డైరెక్టర్ కె జయరాం నాయక్, అడిషనల్ డైరెక్టర్ పి వెంకటరమణ, రీజనల్ ఫైర్ ఆఫీసర్లు జి శ్రీనివాసులు, ఇ స్వామి, డి నిరంజన్‌రెడ్డి, బి సుబ్బారెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎన్ అవినాష్ జయసింహా, సహాయ జిల్లా ఫైర్ ఆఫీసర్ టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.