విజయవాడ

ప్రజలను పట్టించుకోని వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలు అయ్యిందని, ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల అవసరాలను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 18వ డివిజన్ ఆర్‌ఆర్ చికెన్ వద్ద పీజీ రెసిడెన్సీలో ఆదివారం ఆయన డివిజన్ బూత్ కన్వీనర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బూత్‌ల వారిగా పోల్ అయిన ఓట్ల శాతంపై సమీక్ష నిర్వహించారు. డివిజన్‌కు చెందిన చెన్ను చంద్రలీల కుమార్తె చెన్ను జయశ్రీకి బీఎస్‌సీ నర్సింగ్ విద్యాభ్యాసం నిమిత్తం తన సొంత నిధులు రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. రాబోయే కాలంలో బూత్ కన్వీనర్ల వ్యవస్థను పటిష్టం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సొంగా రవీంద్రవర్మ, డివిజన్ పార్టీ అధ్యక్షులు సంజయ్ వర్మ, గద్దె శ్రీరంగారావు, పెద్దిరెడ్డి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవలతో చరిత్రలో నిలిచిపోతారు

విజయవాడ, జూలై 21: సామాజిక కార్యక్రమాలు ద్వారా పేద ప్రజలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని పలువురు వక్తలు కోరారు. నక్కా రాములు, కోటేశ్వరమ్మల చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సభ ఆదివారం శారదా కళాశాల ప్రాంగణంలో జరిగింది. సుమారు వెయ్యి మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్కాలర్‌షిప్‌లు ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మనిషి పుట్టుక, మరణం సహజమని కాని బతికున్న జీవితంలో పరువులకు ఏ విధంగా సహాయ పడ్డాం అదే నిలిచిపోతుందని, చరిత్రలో పేరు చెప్పుకుంటారని అన్నారు. కార్యక్రమంలో నక్క రాజ్యలక్ష్మీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆలపాటి మారుతి దంపతులు, ఉప్పులూరి లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు ఎన్‌వీ కృష్ణయ్య, జగడం భాస్కర్, డీ నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.