విజయవాడ

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ రంగ సంస్థల జేఏసీ రాష్ట్ర మాజీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు ఎంబీ విజ్ఞాన కేంద్రం విజయవాడలో జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని వాగ్దానాలను ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కనీసం ఈ నూతన జగన్ ప్రభుత్వమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ జేఏసీ కార్యదర్శి విజయ్‌కుమార్, నాయకులు నూర్ మహమ్మద్, వసుందర, ఆదినారాయణ, వరప్రసాద్, ఫణికుమార్, ప్రవీణ, అన్ని కార్పోరేషన్‌ల నుండి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

నిత్యం యోగాతో ఆరోగ్యం
విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 21: నిత్యం యోగా సాధన చేయడం వలన అనారోగ్యం దరిచేరదని, శ్వాస ఉన్నంత వరకు యోగా చేయాలని వెంకటేశ్వర యోగీ గురూజీ అన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో 799వ యోగా శిక్షణ శిబిరం ఐదు వారాలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగీ గురూజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ఆరోగ్యం అందించాలన్న ఉద్దేశంతో 1994లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మందికి పైగా యోగా శిక్షణ అందించడమే కాకుండా యోగసనాల ద్వారా కలిగే ప్రయోజనాలకు సంబంధించి సైంటిఫిక్ యోగ పుస్తకాలను అందించినట్లు తెలిపారు. ఆరోగ్యం కోరుకునే వారు తప్పనిసరిగా నిత్యం యోగా సాధన చేయాలని, అదేవిధంగా ఆహార నియమాలను పాటించాలన్నారు. అనంతరం ఐదు వారాలు శిక్షణనిచ్చిన మహాబలి యోగి సుబ్బారావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో భవానీపురం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరామమూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.