విజయవాడ

గుంటూరు జోన్‌లో ఎయిడెడ్ అధ్యాపకులకు పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారిగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడిన గుంటూరు జోన్‌లో ఎయిడెడ్ అధ్యాపకులు, సిబ్బందికి ప్రతి నెల ఠంఛన్‌గా ఒకటో తేదీ నాటికే జీతాలు వచ్చేస్తున్నాయి. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉంటూ ఉన్నత విద్యాశాఖ గుంటూరు జోన్‌కు పూర్తి స్థాయిలో రీజనల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ వెలగాజోషి చేపట్టిన సంస్కరణలే దీనికి కారణంగా పేర్కొనవచ్చు. ఈ సందర్భంగా ఆయనతో ఆంధ్రభూమి ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూసాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు డిగ్రీ కళాశాలలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో అత్యధిక మంది విద్యార్థులు ఇంటర్ నుంచి వృత్తి విద్యపై దృష్టి మళ్లిస్తున్న కారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు విద్యార్థులు లేక ఒక్కటిగా మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ జోషి గత కొద్ది కాలంగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీనికిగాను బీఏ, బీకాం, బీఎస్‌సీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్, కంప్యూటర్ అప్లికేషన్, ఆక్వా కల్చర్ వంటి సరికొత్త కోర్సులు ప్రారంభించగా ఉన్నత విద్యా మండలి నుంచి ఒక్కో కళాశాలకు వరుసగా అనుమతులు తీసుకురావడం ప్రారంభించారు. ఇలాంటి కోర్సుల కోసం అనేక ఎయిడెడ్ కళాశాలల్లో సాలీనా రూ. 30 వేల ఫీజు వసూలు చేస్తుంటే ఎయిడెడ్ కళాశాల్లో రూ. 10 వేలకే అడ్మిషన్లు తీసుకునేలా డాక్టర్ జోషి చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆ మూడు జిల్లాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియన్ కళాశాల యాజమాన్యాలపై కూడా చర్యలు చేపడుతున్నారు. తాజాగా అద్దంకిలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల గుట్టుచప్పుడు కాకుండా డిగ్రీ కళాశాల నిర్వహిస్తుండగా ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకున్నారు.

గౌడ సంఘీయుల సమస్యలు పరిష్కరిస్తా

విజయవాడ, జూలై 21: గౌడ సంఘీయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొ న్న ఆయన మాట్లాడుతూ బీసీల్లో అగ్రభాగాన గౌడలు ఉన్నారని వారి సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. గతంలో రాజమండ్రి వద్ద జరిగిన పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ గౌడ సంఘీయులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని దానిని వెంటనే అమలు చేయాలన్నారు. గౌడ భవన నిర్మాణానికి, విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించాలని, గౌడ హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ
రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్‌గా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, అధ్యక్షులుగా చలపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా చలమోలు అశోక్ గౌడ్, ఫైనాన్స్ సెక్రటరీగా వేముల వెంకటాచలం, గౌరవాధ్యక్షులుగా తాతా శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వాకా రామ గోపాల్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మట్టా వీరబాబు, ఉపాధ్యక్షురాలుగా మాదు శ్రీహరిరాణి, కార్యదర్శిగా చెన్ను విజయలక్ష్మీ, గౌరవ సలహాదారుగా జోగి నాగేశ్వరరావు, లీగల్ ఎడ్వయిజర్‌గా బడుగు మురళీకృష్ణ ఎంపికయ్యారు.