విజయవాడ

శాలివాహనుల సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఉందని, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో జిల్లా, నగర సంఘం విస్తృత స్థాయి సమావేశం ఆదివారం శ్రీరామ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ కుమ్మర శాలివాహన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీ సమస్యలను సంఘానికి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ద్వారా తన దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు, బీసీ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బలహీనవర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించే అన్ని భవనాలకు శాలివాహనలు తయారుచేసే ఇటుకలను కొనుగోలు చేయాలని, దానివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. శాలివాహన కార్పొరేషన్ నిధులను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నారు. అమరావతిలో తమ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపానికి స్థలం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణాజిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు బొమ్మిన శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు భర్తవరపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక వైద్య చికిత్స విధానంపై అవగాహన

విజయవాడ, జూలై 21: ప్రమాదాలు జరిగి గాయాలపాలైన సందర్భంలో, వివిధ రుగ్మతుల వలన అకస్మాత్తుగా వ్యక్తులు అస్వస్థతకు గురైన సమయాల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరికీ ప్రాథమిక వైద్య చికిత్సపై అవగాహన ఉండాలనే సంకల్పంతో పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలపై ఇండియన్ అకడమిక్ ఆఫ్ పీడియాట్రిక్స్, ఆంధ్ర ఆసుపత్రి వారి సహకారంతో ప్రాథమిక వైద్య చికిత్సపై ఆదివారం అవగాహన కలిగించారు.. ఏఎస్ రామారావు హాల్‌లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్, క్రైం, ఆర్మ్‌డ్ రిజర్వ్, పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాల పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమంలో ప్రమాదానికి గురైన, ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి, గుండెకు మర్దన చేయడం ద్వారా కలిగే ఫలితాల గురించి డెమో ద్వారా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ డీ కోటేశ్వరరావు, సీటీ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జీ రాజీవ్‌కుమార్, ఏఆర్ ఏసీపీ చెంచురెడ్డి, హోంగార్డు డీఎస్‌పీ ఐ మోహన్‌కుమార్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సెక్రటరీ డా రామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.