విజయవాడ

సాహిత్యం ఏదైనా మంచి వైపు మళ్లించేలా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: ప్రక్రియ ఏదైనా సాహిత్యం - సమాజాన్ని చెడు నుండి మంచి వైపు దారి మళ్లించే తాజా నీటి ప్రవాహంలా ఉండాలని పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రసిద్ధ రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మీ సాహిత్య సమాలోచనం, ఆత్మీయ సదస్సు జరిగింది. రోజంతా జరిగిన ఈ సమాలోచన నాలుగు సదస్సులుగా విభజించారు. మొదటి సదస్సులో రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘అమ్మకో అబద్దం’ కథా సంపుటిని జీ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సదస్సుకు సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి డా సీ భవానీదేవి అధ్యక్షత వహించారు. రెండవ సదస్సులో అల్లూరి గౌరీలక్ష్మి రాసిన కథల పుస్తకాలపై సమీక్ష జరిగింది. ఈ సదస్సుకు సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి డా సీ భవానీదేవి అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు హాజరయ్యారు. మరోచిత్రం పుస్తకాన్ని డా వెలువోలు నాగరాజ్యలక్ష్మి వసంత కోకిల పుస్తకాన్ని ప్రసూనా బాలాంత్రపు, కొత్తచూపు పుస్తకాన్ని అత్తలూరి విజయలక్ష్మి సమీక్షించారు. మూడవ సదస్సులో అల్లూరి గౌరీలక్ష్మి రాసిన నవలపై సమీక్ష జరిగింది. ఈ సదస్సుకు సుప్రసిద్ధ రచయిత్రి డా నాడ్రేవు వీరలక్ష్మిఅధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు హాజరయ్యారు. నాలుగవ సదస్సులో అల్లూరి గౌరీలక్ష్మీ రాసిన కవితా సంపుటాలపై సమీక్ష జరిగింది. ఈ సదస్సుకు సుప్రసిద్ధ కవయిత్రి డా ఎంబీడీ శ్యామల అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి హాజరయ్యారు. నిలువుటద్దం కవితా సంపుటిని బండ్ల మాధవరావు, నీరెండ దీపాలు కవితా సంపుటిని మందరపు హైమవతి, భావవల్లరి పుస్తకాన్ని డాక్టర్ కాళ్లకూరి శైలజ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి, రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మిని నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమాన్ని మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ, చొప్పా రాఘవేంద్రశేఖర్ పర్యవేక్షించారు.