విజయవాడ

ఐదు బిల్లులు విప్లవాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 22: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులను అడ్డుకున్న చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. గతంలో బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకుని మోసం చేశారని విమర్శించారు. గతంలో వారే పార్టీకి వెనె్నముక అని చంద్రబాబు చెప్పారని, ఎన్నికలకు ముందు నారుూబ్రాహ్మణులు తమ సమస్యలు పరిష్కరించమంటే తోకలు కత్తిరిస్తామని బెదిరించారన్నారు. బీసీ వర్గాలు చంద్రబాబును మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారని, ఈరోజు తన చర్యలతో ఆయన చరిత్ర హీనుడయ్యాడన్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి వైఎస్ జగన్‌ను ఆదరించారనే అసూయతో బిల్లులను అడ్డుకున్నట్లు కనిపిస్తోందన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏ రాష్ట్రం చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులు ప్రవేశపెట్టారన్నారు. శాసనసభ సమావేశంల్లో ఎన్నడూ లేనివిధంగా పోడియం దగ్గరకు తన ఎమ్మెల్యేలను పంపి అణగారిన వర్గాల అభ్యున్నతికి సంబంధించిన బిల్లులను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా తన కేబినెట్‌లో 60శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ జగన్ స్థానం కల్పించారని జంగా గుర్తుచేశారు.

పోలీస్ కమిషనరేట్‌లో
‘స్పందన’కు 63 ఫిర్యాదులు

విజయవాడ (క్రైం), జూలై 22: నగర పోలీసు కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా స్థల వివాదాలకు సంబంధించి 17 పిటిషన్లు, భార్యభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించి 14 ఫిర్యాదులు, స్వల్ప తగాదాలకు సంబంధించి 12 పిటిషన్లు, నగదు లావాదేవీలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని జరిగిన మోసాలకు సంబంధించి నాలుగు, అద్దె వివాదాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు, సాయిలతా చిట్స్ బాధితుల ఫిర్యాదులు మూడు, రెండు దొంగతనాల కేసులు, చెక్ బౌన్స్‌పై ఒక ఫిర్యాదు ఉన్నాయి. వీటన్నింటినీ వారంలోగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు సిఫార్సు చేస్తూ జాయింట్ కమిషనర్ నాగేంద్రకుమార్ ఆదేశాలు జారీ చేశారు.