విజయవాడ

సామాజిక న్యాయ సాధనకు మరో పవిత్ర యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్థితిగతులను శాశ్వతంగా మార్చే మరో పవిత్ర యుద్ధానికి ముఖ్యమంత్రి నాంది పలికారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమాన అవకాశాలకు నోచుకోని మహిళల కోసం కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ఐదు కొత్త బిల్లులు సామాజిక న్యాయం సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఓట్ల కోసం, రాజకీయ అనిశ్చితి దాటడం కోసం బీసీ కమిషన్‌ను వాడుకునే స్వార్థ రాజకీయ పార్టీలకు భిన్నంగా వెనుకబడిన తరగతుల బాధను అర్థం చేసుకుని వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు దిశగా చట్టాన్ని ప్రవేశపెట్టడం అపూర్వఘట్టమన్నారు. దళితులకు, మైనారిటీలకు, సాధికారత, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అన్ని వర్కుల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. ఇది విప్లవాత్మక చర్యగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంస్కరణ ప్రశంసించదగినదన్నారు. తమకు దక్కని అవకాశం ఇతరులు పొందుతుంటే ఆగ్రహం సాధారమణమని, కానీ దానికి సోమవారం ప్రభుత్వం చెల్లుచీటి రాసిందన్నారు. ప్రజల కష్టాలు పాదయాత్రలో గమనించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

గవర్నర్ నరసింహన్‌కు ఘన స్వాగతం
విజయవాడ (క్రైం), జూలై 22: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన నరసింహన్ దంపతులు సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యుడు మల్లాది విష్ణు, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ప్రొటోకాల్ డైరెక్టరు కిషోర్‌కుమార్, డీజీపీ దామోదర గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసు బెటాలియన్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన విజయవాడ చేరుకున్నారు.