విజయవాడ

104, 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్రంలో 104, 108 మెడికల్ సర్వీసులు సరిగ్గా పని చేయడం లేదన్నది అక్షర సత్యం, దివంగత వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీతోపాటు 104, 108 సర్వీస్‌ల సేవలను మరింత మెరుగుపరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో అధికారపక్ష సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మూలే సుధీర్‌రెడ్డి, ఎం తిప్పేస్వామి, ఉండవల్లి శ్రీదేవి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి పై విధంగా బదులిచ్చారు. మండలానికో 104, 108 అంబులెన్స్ ఏర్పాటుకై చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఉన్న వీటి సంఖ్య 670 కాగా ఈ సంఖ్యను 1050కి చేరుస్తామన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు మాసాల కోసారి సిబ్బందికి శిక్షణ ఇప్పించేలా చూస్తానన్నారు. గోపిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఇతర ప్రమాదాలకు గురైన వారిని సరిగ్గా గంటలోపు ఆసుపత్రికి చేర్పించిగల్గితే ప్రజల ప్రాణాలను కాపాడగల్గుతామన్నారు. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అనేక విహనాలు సరైన మరమ్మతులు లేక మూలపడ్డాయని కొన్నింటిలో డాక్టర్లు ఉండటంలేదని, టెక్నిషియన్‌లకు సరైన వైద్య అనుభవం లేకపోవటం వల్ల తక్షణ చికిత్స జరగటంలేదన్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు అథార్టీని ఆర్భాటంగా ప్రకటించారు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ప్రవేశించే ప్రాంతాల్లో ప్రభావవంతమైన పర్యాటక అభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రి చంద్రబాబు 2015, జూలై 26న ఆర్భాటంగా అఖండ గోదావరి ప్రాజెక్టు అథార్టీని ప్రకటించారు కానీ ఆర్థిక మంజూరు ఇవ్వలేదని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. స్వదేశీ దర్శన్ పథకం కింద రూ. 122.58కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో 2016, డిసెంబర్ 19న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించినప్పటికీ నేటి వరకు స్పందన లేదన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పర్యాటక అభివృద్ధికి రూ. 100కోట్లు మంజూరు చేసినా రూ. 10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేసారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రతి దానికి ఆయనపై నిందలు వేయటం మినహా ముందుకు సాగటం లేదన్నారు.
మున్సిపాల్టీలుగా గురజాల, దాచేపల్లి
గురజాల, దాచేపల్లి మండల కేంద్రాలను మున్సిపాల్టీలుగా మార్చి ఎన్నికలు జరిపించడానికి తగు చర్యలు తీసుకుంటామని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కాసు మహేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చారు. దాచేపల్లిలో సరిపడ జనాభా లేనందున సమీపంలోని నడికుడిని విలీనం చేయాల్సి ఉందన్నారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ 800 ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన పల్నాడు అభివృద్ధికి తొలుత కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే ఎంతగానో కృషి చేసారని అన్నారు. నడికుడి మీదుగా రైలు, రోడ్డు మార్గాలు రావటంతో పల్నాడు దశ తిరిగినట్లయిందన్నారు.