విజయవాడ

ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయంలో వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 15: ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోల్చుకుంటే రూ. 120 కోట్ల అ ధిక ఆదాయాన్ని రైల్వే డివిజన్ నమో దు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పీ శ్రీనివాస్ అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్ప ణ చేశారు. అనంతరం ఆర్పీఎఫ్ సి బ్బంది కవాతులో గౌరవ వందనం స్వీ కరించారు. ఈసందర్భంగా దక్షిణ మ ధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పంపిన సందేశాన్ని ఆంగ్లం లో చదివి వినిపించారు. జాతిపిత మ హాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2న 1966లో దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించిందని, ఆనాటి నుంచి జోన్ దినదినాభివృద్ధి చెందుతూ 2018-19 ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిందని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేష న్, పర్సనల్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇం జనీరంగ్, స్టోర్స్ వంటి నాలుగు విభాగాల్లో పెర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ షీల్డ్‌లు సాధించి భారతీయ రైల్వేలోనే జాతీ య స్థాయిలో రికార్డు సాధించిందని చెప్పడానికి గర్విస్తున్నామన్నారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూలై వరకు రూ. 4906 కోట్ల స్థూల ఆ దాయాన్ని ఆర్జించి ఇదే కాలవ్యవధిలో గత సంవత్సరం కంటే రూ. 120 కోట్లు అధిక ఆదాయాన్ని నమోదు చేసిందన్నారు. వినియోగదారుడే భారతీయ రె ల్వేలకు మహారాజు అని, వారికి భద్రత, రక్షణతో పాటు సౌకర్యంతో కూడిన ప్ర యాణాన్ని కల్పించడం ప్రధాన పాత్ర గా పోషిస్తుందన్నారు. జోన్ పరిధిలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్లన్నిటి నీ అంచలంచెలుగా తొలగించడంతో భారతీయ రైల్వేలోనే ప్రథమ స్థానం సాధించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో ఓబులవారిపల్లె - వెంకటాచలం స్టేషన్లను కలుపుతూ 93 కి.మీల విద్యుదీకరణతో కూడిన నూతన రైలుమార్గాన్ని నిర్మించి ప్రారంభించామన్నారు. అనంతరం ఆశా, కిరణ్‌బాల ప్రదర్శించిన ఏకపాత్రాభినయం చూపరులను ఆకట్టుకుంది. అలాగే వీధి బా లలను పోషిస్తున్న ఎస్‌కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము సైతం అనే పాటతో కూడిన నృత్యాన్ని ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందా రు. తరువాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ ప్రశంసలందించిన సిబ్బందికి డీఆర్‌ఎం నగదు పురస్కారం అందజేశారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ డీఆర్‌ఎం కప్‌ని గెలుపొందిన వారికి డీఆర్‌ఎం తన చేతులమీదుగా కప్ అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం రామరాజు, సుమన, సీనియర్ డీసీఎం భాస్కర్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.