విజయవాడ

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 15: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా మహిళ లు, చిన్నారులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. 73వ స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయం లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులు అర్పించారు. అనంతరం వీఎంసీ పాఠశాలల ఎన్‌సీసీ వలంటీర్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించగా కమిషనర్ వెంకటేష్ గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాలతో వచ్చిన స్వాతంత్య్రం, స్వేచ్ఛా హక్కులను మనమంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశాన్ని రక్షించడంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న సైనికులను గౌరవించి, వారి ఆదర్శాలు, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లవుతున్నా మహిళలు, చిన్నారులకు పూర్తి భద్రత కల్పించలేక పోతున్నామని, మగ పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఆడపిల్లల పట్ల సోదరభావం కలిగేలా వారిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మహిళలకు భద్రత కల్పించడం, వారిని గౌరవించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. వీఎంసీ అదనపు కమిషనర్ (జనరల్) శకుంతల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శారద, సిటీప్లానర్ లక్ష్మణరావు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వెంకటలక్ష్మి, ఎగ్జామినర్ అశోక్‌వౌర్య, వీఏఎస్ శ్రీ్ధర్, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వీఎంసీ పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి.

జన్మదినం సందర్భంగా
మంత్రి వెలంపల్లికి ఘన సన్మానం
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 15: దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి వెలంపల్లికి మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు, తలశిల రఘురాం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అర్చకులు, వేదపండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ మంత్రి వెలంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మొక్కను బహూకరించారు. అనంతరం కేబీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పేదలకు రక్తదానం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి వెలంపల్లిని ఘనంగా సన్మానించారు.