విజయవాడ

జగనొచ్చాడు.. వరుణుడు పోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 15: జగన్ సీఎం అయ్యాక వరుణుడు రాష్ట్రంలోకి రావడం మానేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాడని తెలిసి వరుణుడు పక్కరాష్ట్రాలకు వెళ్లినట్లుగా ఉన్నాడని గురువారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోందన్న ఆయన వైకాపా నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ పెద్ద ఎత్తున బిల్డప్ మాత్రం ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్న ఆయన మూడు జిల్లాల్లో సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తాగేందుకు కనీసం నీరు కూడా లేకపోవడంలో ప్రజలు అల్లాడుతున్నారని ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు ఎలాగూ నీరు లేదు కనీసం తాగేందుకైనా నీరు ఇవ్వాలంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వరుణుడు ఏమయ్యాడో అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో నూతన స్కీంకు తెరలేపిన సీఎం జగన్ మద్యం దుకాణాల మాటున పెద్ద స్కామ్ చేస్తున్నారని లోకేష్ ట్విట్టర్‌లో ఆరోపించారు. మీరు తెరలేపిన కొత్త మద్యం పాలసీ అదిరింది జగన్ అంటూ పేర్కొన్న ఆయన ప్రభుత్వ మద్యం దుకాణంలో తమ బ్రాండ్ ఉండాలి అంటూ సరికొత్త స్కాంకు తెరలేపారన్నారు. జే టాక్స్ కాట్టాల్సిందేనంటూ ఇప్పటికే లోటస్ పాండ్ ఇంటి నుండి లిక్కర్ కంపెనీలకు ఫోన్లు కూడా వెళ్లాయన్నారు. పైగా మద్య నిషేదం మా అక్కచెల్లిళ్ల కోసం అంటూ పెద్ద ఎత్తున జగన్ బిల్డప్పులు ఇవ్వడం అవసరమా అంటూ ట్విట్టర్‌లో లోకేష్ ప్రశ్నించారు.