విజయవాడ

పశ్చిమ ఫొటోగ్రాఫర్లకు ఘన సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్, అబ్దుల్ కలాం సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. వన్‌టౌన్‌లోని శ్రీ గౌతమి హైస్కూల్‌లో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి స్మైల్స్ అధ్యక్షుడు నల్లని సూర్యారావు అధ్యక్షత వహించారు. అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షుడు వేముల వెంకవ్రు సహకారంతో ఫొటోగ్రాఫర్ అమర్నాధ్, జమలయ్య, టీఎస్‌ఎన్ మూర్తి, పీ కోటిరెడ్డి, బీ పరమేశ్వరరావు, వీ వేముల వెంకట్రావు, డీ వెంకట్రావు, తదితరులను సత్కరించారు. ఈసందర్భంగా సూ ర్యారావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఫొటోగ్రాఫర్లు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి క్లబ్ తరపున చిరు సత్కారం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత, సీనియర్ లయన్ లీడర్ ఎంవీ రావు, లయన్ లీడర్ బలివాడ శివకుమార్ పట్నాయక్, క్లబ్ కార్యదర్శి ఈశ్వరరావు, రాజగిరి సోమేశ్వరరావు పాల్గొన్నారు.

స్పందన అర్జీలకు సమగ్ర పరిష్కారం
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 19: స్పందనలో అందిన వినతులకు అ ర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమై న, సమగ్రమైన పరిష్కారం అందించే లా చర్యలు తీసుకున్నామని సబ్ కలెక్టర్ మిషాసింగ్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ మిషాసింగ్ అర్జీదారుల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన విజ్ఞాపనలను స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ స్పందనలో వచ్చిన ఆర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. 6545 అర్జీలు అందగా వాటి లో 5787 ఇళ్లకోసం, 166 పెన్షన్‌ల కో సం, పౌరసరఫరాలకు 400, తహసీల్దార్లకు 47, ఇతరమైనవి 88 ఉన్నాయన్నా రు. ఆర్జీల పరిష్కరంలో వేగంతో పా టు నాణ్యత ఉండేలా ప్రతిస్థాయిలో పూర్తి పర్యవేక్షణ ఉందన్నారు. పరిష్కా రం అందుకున్న అర్జీదారులకు ఫోన్‌చే సి వారి అభిప్రాయాన్ని స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆర్జీలలో ఎక్కువగా ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులకు సం బంధించి ఎక్కువగా దరఖాస్తులు అం దుతున్నాయన్నారు. వీటిని పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో నమోదు చేస్తా మని పేర్కొన్నారు. వరద తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ముంపు ప్రాంతంలో అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాల ను నిర్వహించేందుకు ప్రత్యేక డ్రైవ్ ని ర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఎం మాధవి, తదితరులు పాల్గొన్నారు.