విజయవాడ

పునరావాస కేంద్రాలు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: పశ్చిమలోని భవానీపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాలు సోమవారం ఉదయానికే ఖాళీ అయ్యాయి. వరద ప్రభావం క్రమేణా తగ్గడంతో భవానీపురం కరకట్ట ప్రాంతవాసులు పునరావాస కేంద్రాలను వదిలి ఇంటిముఖం పట్టారు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చివరకు డివిజన్ స్థాయిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన వలంటీర్లను కూడా వరద బాధితులకు సేవల్లో వినియోగించుకున్నారు. సకల సౌకర్యాలు కల్పించిన అధికారులు, సిబ్బందికి వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయమే షాదీఖానా, ఉర్దూ స్కూల్‌లోని శిబిరాలు మూసేశామని వెస్ట్ మండల ఎమ్మార్వో సుగుణ తెలిపారు.

అక్టోబర్ నాటికి
పని ప్రారంభించాలి
పెనమలూరు, ఆగస్టు 19: పోరంకి గ్రామంలో చెత్త నుండి సంపథ తయారీ కేంద్రాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ జస్టిస్ బి శేషశయనరెడ్డి సోమవారం పరిశీలించారు. కేంద్రంలో ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తడి, పొడిచెత్తను వేరుచేసి కంపోస్ట్ తయారీ పనిని అక్టోబర్ నాటికి ప్రారంభించాలని ఆయన సూచించారు. కాలుష్యం లేని పర్యావరణం కోసం ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో చంద్రశేఖర్, ఎంపీడీవో జే విమాదేవి, డీపీఆర్‌సీ పద్మ, నవరత్నం, గ్రామ ప్రత్యేకాధికారి శివశంకరరావు, కార్యదర్శి సుబ్బారావు, సింగోతు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

తగ్గని సందర్శకుల వరద!
*పోలీసులకు తలనొప్పులు
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 19: స్పందనలో అందిన వినతులకు అ ర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమై న, సమగ్రమైన పరిష్కారం అందించే లా చర్యలు తీసుకున్నామని సబ్ కలెక్టర్ మిషాసింగ్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ మిషాసింగ్ అర్జీదారుల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన విజ్ఞాపనలను స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ స్పందనలో వచ్చిన ఆర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. 6545 అర్జీలు అందగా వాటి లో 5787 ఇళ్లకోసం, 166 పెన్షన్‌ల కో సం, పౌరసరఫరాలకు 400, తహసీల్దార్లకు 47, ఇతరమైనవి 88 ఉన్నాయన్నా రు. ఆర్జీల పరిష్కరంలో వేగంతో పా టు నాణ్యత ఉండేలా ప్రతిస్థాయిలో పూర్తి పర్యవేక్షణ ఉందన్నారు. పరిష్కా రం అందుకున్న అర్జీదారులకు ఫోన్‌చే సి వారి అభిప్రాయాన్ని స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆర్జీలలో ఎక్కువగా ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులకు సం బంధించి ఎక్కువగా దరఖాస్తులు అం దుతున్నాయన్నారు. వీటిని పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో నమోదు చేస్తా మని పేర్కొన్నారు. వరద తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ముంపు ప్రాంతంలో అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాల ను నిర్వహించేందుకు ప్రత్యేక డ్రైవ్ ని ర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఎం మాధవి, తదితరులు పాల్గొన్నారు.