విజయవాడ

దుర్గగుడి అభివృద్ధికి పక్కా ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 22: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పర్చేవిధంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో ఎంవీ సురేష్‌బాబు చెప్పారు. దుర్గా మ ల్లేశ్వరస్వామి దేవస్థానం తనకు కొత్త కాదని, అమ్మవారి ఆశీస్సులతో నేడు ఈవోగా వచ్చానని గురువారం ఆయన ‘్భమి’ విలేఖరికి తెలిపారు. దుర్గగుడిలో గతంలో విధులు నిర్వహించటం వల్ల అన్ని శాఖలపై అపారమైన అనుభవం ఉందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ప్రస్తుతం రానున్న దసరా మ హోత్సవాలను అత్యంత విజయవంతంగా పూర్తి చేయాల్సిన కీలకమైన బా ధ్యత తనపై ఉందన్నారు. గతంలో పనిచేసిన అనుభవం, ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకొని వచ్చిన భ క్తులందరికీ అమ్మవారి దర్శనం చేయించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమ్మవారి దేవస్థానంలో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇదే సమయంలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను కూ డ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించి న వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో అభివృద్ధి పనులపై చర్చించానన్నారు. అన్నవరం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులకు, ఇక్కడ పనులకు మ ధ్య కొంత తేడా ఉందన్నారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ముందు దసరా మహోత్సవాలను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం అభివృ ద్ధి పనులు, ఆదాయం పెంపుదల, దాతలను భాగస్వాములుగా చేర్చి వారి చేత అభివృద్ధి పనులు చేయించటం వంటి వాటిని దృష్టి సారించనున్నట్లు తెలిపా రు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నిత్యం అందుబాటులో ఉంటారు కనుక, మంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టి త్వరగా పూర్తిచేసేందుకు తనకు చక్కటి అవకాశం ఉందన్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ, మరోవైపు వీఐపీలకు ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి లోపం రాకుండా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అన్ని సెక్షన్ల ఉద్యోగులతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి ఉండటం వల్ల వారి సంపూర్ణ సహకారంతో విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలుగుతానని ఈవో సురేష్‌బాబు వివరించారు.