విజయవాడ

ఇంకా తొలగని ‘ఇరుక్కున్న బోటు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 22: ఇరిగేషన్ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ వారికి చాలెంజ్‌గా మారిన ఇసుక బోటు ఇరకాటం సమస్య గురువారం సాయంత్రానికి కూడా తీరలేదు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జాతీయ విపత్తుల స్పందన దళం బుధవారం ఉదయం నుండి బ్యారేజీ 68వ ఖానా వద్ద ఇరుక్కుపోయిన ఇసుక బోను తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ సమస్యపై నీటిపారుదల శాఖ అధికారులు తలల పట్టుకుంటున్నారు. 30మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందం 36గంటలుగా బోటును బయటకు లాగడానికి అంచలంచెలుగా తమ వ్యూహాలు మార్చుతూ ప్రయత్నిస్తున్నా గానీ బోటును బయటకు తీయలేకపోయారు. విపత్తుల సమయంలో ప్రాణాలొడ్డి ఎంతోమంది విలువైన ప్రాణాలు, ఆస్థులు కాపాడిన ఈ బృందం పడవ తొలగింపు విషయంలో మాత్రం తలప్రాణం తోకకొస్తోందని అల్లాడుతున్నారు. ఈవిషయంపై దళం ద్వితీయ కమాండర్ సంతోష్ కుమార్ శర్మ ‘్భమి’తో మాట్లాడారు. దేశంలోనే తొలిసారి ఇలాంటి జటిలమైన సమస్యను ఎదుర్కొన్నామని ఆయనన్నారు. ఈ ఆపరేషన్‌ని ‘బోట్ రిమూవింగ్ బ్యారేజీ ఛానల్’గా పిలుస్తామన్నారు. నదుల్లో కొట్టుకుపోయిన వారిని ఎంతో శ్రమకోర్చి కాపాడిన సందర్భాలున్నాయని తెలిపారు. తమ బెటాలియన్‌కు మంగళగిరిలో 1100 మంది సిబ్బంది ఉన్నారని, అందరూ ప్రాణాలు లెక్కచేయకుండా ఎలాంటి విపత్తుల్లోనైనా ప్రజల ప్రాణాలు కాపాడటంలో ఆరితేరారని చెప్పారు. తమ సిబ్బంది మొదటిగా ఇలాంటి ఛాలెంజ్‌ను ఎదుర్కొందన్నారు. అయినా తాము పడవని బయటకు లాగాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. బ్యారేజీకి ఎలాంటి నష్టం జరగకుండా తమ ఆపరేషన్‌లో 68వ ఖానాలో ఒక్క పెచ్చుకూడా లేవకుండా బ్యారేజీని కాపాడాలనే దృష్టి, పట్టుదలతో ఉన్నామన్నారు. ప్రస్తుతం వంతులవారీగా 30మంది సిబ్బంది నిర్విరామంగా శ్రమ పడుతున్నారని తెలిపారు. ఫెర్రి సమీపంలో పడవ మునక సంఘటనలో చాలామందిని ప్రాణాలతో బయటపడేసింది తమ సిబ్బందేనని గుర్తుచేశారు. పడవను తీస్తేగాని 68వ ఖానా వద్ద గేటును కిందకి దించడానికి వీలుపడని పరిస్థితి నెలకొంది.