విజయవాడ

అరచేతిలో అభ్యర్థన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 22: సమస్యల పరిష్కారం కోసం, అక్రమాలపై ఫిర్యాదుల కోసం ఇక నుండి అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరిగే అవసరం లేదు. మీ చేతిలో అండ్రాయిడ్ ఫోన్ ఉండి, ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటే మీ అరచేతిలో నుండే ఫిర్యాదు, సమస్యలను అధికారులకు నేరుగా తెలియజేయవచ్చు. మీరు పంపిన సమస్యలు, అక్రమాలకు సంబంధించిన పరిష్కారం దాని స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టోలోఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఫిర్యాదుదారుడు తన ఇంటి నుండే ఫిర్యాదును ప్రభుత్వానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక నుండి సమస్యలను అధికారులకు తెలిపేందుకు ప్రతీ సోమవారం గ్రామ, వార్డు, మండల, డివిజన్, జిల్లా కేంద్రాలకు పరిగెట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్పందనకు దరఖాస్తులు అందించవచ్చు.
నమోదు సులభతరం
తమ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసేందుకు ఫిర్యాదుదారుడుకు రవాణా ఛార్జీలు, వ్యయప్రయాసలు కీలకమవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ స్పందన.ఏపీ.జీవోవి.ఇన్ అని ఆన్‌లైన్‌లో టైప్ చేస్తే పోర్టల్ తెరచుకుంటుంది. ఇందులో యూజర్ లాగిన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫిర్యాదు దారుడి ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. సెల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది. శాఖల వారీగా వివరాలు కనిపిస్తున్నప్పుడు ఫిర్యాదుదారుడు తాను ఏ శాఖకు సంబంధించిన సమస్య చెబుతున్నది ఎంపిక చేసుకుని, అక్కడ కనిపించే దరఖాస్తు ఫారం ద్వారా తన ఫిర్యాదును స్పందనకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న ఫిర్యాదు నేరుగా సంబంధిత శాఖకు చేరుతుంది. తరువాత ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువులోగా అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ, వార్డుల వారీగా ఫిర్యాదులు నమోదు చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అలాగే ఫిర్యాదు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. 1100తో పాటు 1800 425 4440 ద్వారా ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంది. స్పందన పోర్టల్‌లో సమాచారం మొత్తం తెలుగులోనే ఉండటంతో ఫిర్యాదుదారుడు సులువుగా తన ఫిర్యాదును నమోదు చేసే వీలు కలుగుతుంది. గతంలో కూడా వచ్చిన దరఖాస్తులు కూడా ఇప్పుడు ఆన్‌లైన్ స్పందన పోర్టల్‌లో అందుబాటులో అధికారులు ఉంచారు.