విజయవాడ

సత్యనారాయణపురం రోడ్లను చూస్తే గత ప్రభుత్వ నిర్వాకం కన్పిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: కురుసే కొద్దిపాటి వర్షానికే సెంట్రల్ నియోజకవర్గంలో కీలకమైన సత్యనారాయణపు రం రహదారులన్నీ మురుగు, వరద నీ టితో తేలియాడుతున్నాయని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శర్వాణి మూర్తి అన్నారు. ఎవరైనా ఒక్కసారి ఈ రోడ్లను చూస్తే గత ప్రభుత్వ ఘనత అ లాగే స్థానిక ప్రజాప్రతినిధుల పనితీ రు ఎంత గొప్పగా ఉందో అవగతమవుతుందంటూ ఎద్దేవా చేశారు. సత్యనారాయణపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో నాటి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సత్యనారాయణపురంలో అన్ని సిమెంట్ రోడ్లను వేయిస్తే గత ప్రభుత్వ హయాంలో తిరిగి వాటిపై నాసిరకమైన సిమెంట్ రోడ్లను వేయటంతో అత్యధిక గృహాలు, లోతట్టులోకి వెళ్లాయని, అలాగే వరద నీరు వెళ్లే దారిలేక నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తోందన్నారు. రేపోమాపో మున్సిపల్ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కో-ఆర్డినేటర్లు, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, కొప్పరపు మారుతి, తల్లాప్రగడ రాజా, వెంటప్రగడ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కురుబ, కురుమ, కురవ వర్గాల సంక్షేమానికి
సీఎం జగన్ ప్రత్యేక చర్యలు

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్రం లో కురుబ, కురుమ, కురవ సామాజికవర్గాలు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారని అందుకు అభినందనలు తెలపటంతో పాటు రాను న్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమకు తగిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కురుబ, కురుమ, కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు జే శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. రా ష్ట్ర కమిటీ సమావేశం విజయ నర్సింగ్ కాలేజీలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జున్‌రావు అధ్యక్షత వ హించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు లు మాట్లాడుతూ తమ సామాజిక వ ర్గం గత ఎన్నికల్లో అనేకచోట్ల పోటీ చే సి విజయం సాధించారన్నారు. ము ఖ్యంగా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతో అభిమానంతో తమ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. తమ సా మాజిక వర్గంలోని ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక ర