విజయవాడ

సహాయం అందజేసే పథకంలో భాగస్వాములవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం చేసే పథకానికి రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 18,428 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాగా జిల్లాలో 2,660 దరఖాస్తులు నమోదయ్యాయని డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక బందర్‌రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో ఆదివారం ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన తర్వాత డౌన్లోడ్ కాపీలను డ్రైవర్లకు డీటీసీ అందజేశారు. డీటీసీ మాట్లాడుతూ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఈ పథకం విజయవంతం చేసే దిశగా ప్రభుత్వ సెలవు దినాలలో కూడా జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లలో దరఖాస్తులను ఆన్‌లైన్ నింపే ప్రక్రియను ఉద్యోగులతో చేపట్టామని ఆయన తెలిపారు. ఈ నెల 25తో దరఖాస్తుల స్వీకరణ ముగియనుండటంతో ఈ పథకానికి అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.