విజయవాడ

దుర్గమ్మ సేవలో ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 15: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఆదివారం జగన్మాతను నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం కమిషనర్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. కమిషనర్ దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కమిషనర్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
దుర్గమ్మ సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్
అలాగే రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకర్ నారాయణ దుర్గమ్మను దర్శించుకున్నారు. శంకర్ నారాయణ కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పంచహారతుల సేవలో జస్టిస్ శంకర్ నారాయణ పాల్గొన్నారు. శంకర్ నారాయణ కు వేదపండితులు ఆశీర్వచనాలను అందించగా, ఈవో సురేష్ బాబు ప్ర సాదం, చిత్రపటాన్ని బహుకరించారు.