విజయవాడ

ఓటర్లు తమ వివరాలు సరిచేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 15: జిల్లాలోని ఓటర్లు తమ వివరాలను స రిచేసేందుకు భారత ఎన్నికల సంఘం పలు అవకాశలు కల్పించిందని వాటిని వినియోగించుకుని వారి వివరాలు చూ సుకోవాలని జాయింట్ కలెక్టర్ కే మా ధవీలత తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్, మొబైల్ యాప్, ఎన్నికల సంఘం ఎన్‌వీఎస్‌పీ పోర్టల్ ద్వారా వివరాలు చూ సుకోవచ్చని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సాధారణ సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్ల డం ద్వారా ఓటరు నమోదు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయక కేంద్రానికి వెళ్లి ఓటర్లు తమ వివరాలు సరిచేసుకోవచ్చన్నారు. వికలాంగులైన ఓటర్లు 1950 హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ వివరాలు సరిచూసుకోవచ్చన్నారు. ఓటర్లు తమ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేక ఏమైనా తప్పులు సవరించాలా అనే వివరాలు, వారి ఫోన్ నెంబర్ ఈఆర్‌ఓ కార్యాలయంలోని ఓటరు సహాయక కేంద్రంలో సంబంధిత ధ్రువ పత్రాలతో ఒకదాని నకలుతో కలిపి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు వ్యక్తిగత వివరాలు అనగా ఓటరు పేరు, ఫొటో, పుట్టిన తేదీ, వయసు, బంధువుల పేరు, చిరునామాలో తప్పులు సరిచేసుకునేందుకు భారతీయ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రైతులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒక ధ్రువ పత్రం నకలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. తమ కుటుంబంలో ఓటరు ఎవరైనా మరణించినా లేక శాశ్వతంగా వలసపోయినా ఫారం-7 ద్వారా తెలియజేయాలన్నారు. అర్హులైన ఓటర్ నమోదు కాని కుటుంబ సభ్యులు అనగా జనవరి 1 2001 నాటికి జన్మించిన వ్యక్తులు, భవిష్య ఓటర్ అనగా జనవరి 1 2002 నాటి నుండి జనవరి 1, 2003 మధ్యలో జన్మించిన వ్యక్తుల వివరాలను తెలియజేయాలన్నారు. తమ పోలింగ్ కేంద్రం సక్రమంగా లేకపోతే ప్రత్నామ్నాయ భవన వివరాలు సూచించవచ్చన్నారు. ఈ అవకాశం సకాలంలో సద్వినియోగం చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ ద్వారా కూడా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు. అయితే ఇందుకోసం ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.