విజయవాడ

ఓటరు పరిశీలన వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 15: స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద ఓటర్ల వివరాలు సరిచేసే కార్యక్రమాన్ని ము మ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. నగరంలో ని తన క్యాంపు కార్యాలయం నుండి ఆదివారం ఆమె ఓటరు నమోదు అధికారులు, నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్లు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌లతో టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని స్థాయిల్లో దీనిని వేగవంతం చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు తీసుకోవాలన్నారు. రెం డు రోజుల్లో కేవలం 10వేల ఓటర్ల వివరాలు మాత్రమే పరిశీలించారని, అయి తే ప్రతి నియోజకవర్గంలో కనీసం రో జుకు 10వేల ఓటర్ల వివరాలు పరిశీలిస్తే తప్ప ఈ కార్యక్రమం పూర్తి కాదన్నా రు. ఈ విషయంపై సంమంధిత ఈఆర్‌వోలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలు తమ తమ పరిధిలోని తహసీల్దార్‌లతో ఓట ర్లు వివరాల పరిశీలన కార్యక్రమంపై రోజువారీ పర్యవేక్షణ ఖచ్చితంగా చే యాలన్నారు. మంగళవారం ఇదే అం శంపై తిరిగి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పోష ణ్ అభియాన్ కార్యక్రమం వివరాల సే కరణకు అంగన్వాడీ కార్యకర్తలు తమ ట్యాబ్లను వినియోగిస్తున్న దృష్ట్యా ఆ పనికి అడ్డంకి లేకుండా వేరే ట్యాబ్‌ల ను వినియోగించుకోవాలన్నారు. ఓటర్ల పరిశీలనకు ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఎక్కువగా వినియోగించుకునేలా బీఎల్‌వోలను, ఓటర్లను, గ్రామ వలంటీర్లను చైతన్య పరచాలన్నారు. ప్రతి గ్రామంలో చాలా మంది వద్ద స్మార్ట్ఫోన్‌లు, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో సంబంధిత ఓటర్ల నమోదు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఓటర్లు తమ వివరాలను సరిచూసుకునేలా చైతన్య పరచాలన్నారు. బీఎల్‌వోలు తమ వ్యక్తిగత ఆండ్రాయిడ్‌లను కూడా వినియోగించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలోని స్వయం సహాయక గ్రూపు సభ్యులను కూడా చైతన్య పరిచి వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారి కుటుంబ సభ్యుల ఓటర్ వివరాలను పరిశీలింపజేయాలన్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డు జిల్లాలో వెబ్‌లాండ్‌లో అడంగల్స్ సరిచేసే కార్యక్రమం త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం నిర్వహించిన గ్రామ సభలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు అనే వివరాలు అందించాలన్నారు. ఇందుకు సంబంధించి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అక్టోబర్ 3న ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో విజయవాడ నగరం తప్ప మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు అర్హులైన, అనర్హత కలిగిన వివరాలు డేటా ఎంట్రీ వెంటనే చేయాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, సబ్‌కలెక్టర్ స్వప్నిల్ దినకర్, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు ఉదయభాస్కర్, సత్యవేణి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా పీడీ సూర్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.