విజయవాడ

దసరాకు ఏర్పాట్లు, ఉత్సవాలతో ఫ్లైఓవర్ పనుల్లో మరింత జాప్యం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: దుర్గగుడి సమీపంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే అంతులేని జాప్యం తో సాగుతుండగా దసరా ఏర్పాట్లు, ఉ త్సవాలు కొంత ఆటంకంగా నిలవనున్నాయి. దసరా ఉత్సవాలకు కనీసం 15లక్షల మంది భక్తులు వస్తున్నందున పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. స్థాని క ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రా ష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కావటంతో గతంలో కంటే విభిన్నంగా జరపాలని ఈ ఉత్సవాలను ప్రతిష్టాకరంగా తీసుకున్నారు. దీనివల్ల ఫ్లైఓవర్ పనులకు ఆ టంకం కలుగుతోందని సోమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ఫ్లైఓవర్ పనుల వల్ల దసరా ఏ ర్పాట్లకు అవాంతరాలు కలుగుతున్నాయని వాదిస్తున్నారు. విజయదశమి రా ష్ట్ర పండుగ అయినప్పటికీ మూడేళ్లుగా దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ప్రభు త్వం నుంచి నయాపైసా సహాయం అందలేదు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉ త్సవాలు ఈ నెల 29న ప్రారంభమై వచ్చే నెల 8 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ప్రారంభానికి ఇంకా కేవలం రెండు వారాల సమయం కూడా లేదు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరగబోయే ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలోభాగంగా మంత్రి వెలంపల్లి, స్థానిక ఎమ్మెల్యే విష్ణు పలువురు అధికారులతో పలుమార్లు ఆప్రాంతంలో పర్యటించారు. సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించినా ఈ నెల 25 నాటికి ఏర్పాట్లు పూర్తికావాలని మంత్రి డెడ్‌లైన్ విధించారు. తాత్కాలికంగా వంతెన నిర్మాణ పనులు నిలిపివేస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వారి రాష్ట్రాలకు వెళ్లిపోతారని, పనులు ఆలస్యమైతే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతుందని సోమా కంపెనీ ప్రతినిధులు వాపోతున్నారు. అన్నింటికీ మించి పార్కింగ్ పెద్ద సమస్య. వీఎంసీ కార్యాలయాన్ని ఆనుకుని అటు రాజీవ్ గాంధీ పార్కు వరకు, ఆ స్థలానికి ఎదురుగా కృష్ణవేణ్ ఘాట్, పద్మావతి ఘాట్ల ముందున్న స్థలాలను గతంలో ఎప్పుడూ పార్కింగ్‌కు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ రోడ్డులో కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అండర్ పాస్ నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుండటంతో దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు కుంచించుకుపోతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. పద్మావతి ఘాట్ స్థలాన్ని తాజాగా ఫుడ్ కోర్టులకు లీజుకిచ్చారు. ఈనేపథ్యంలో వాహనాల పార్కింగ్ పెద్దసమస్యగా మారింది.

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 15: సమాజంలో విద్యార్థులకు ఓ గుర్తింపు తీసుకువచ్చి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేది గురువులేనని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చిట్టినగర్ శ్రీ నగరాల కల్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వెలంపల్లి, ఆత్మీయ అతిథులుగా సీ ఛానల్ ఎండీ టీ రమేష్, లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ ఏ సుధాకర్‌రెడ్డి, బాయన బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించి వారికి సన్మానాలు నిర్వహిస్తున్న క్లబ్ అధ్యక్షులు సూర్యారావును కొనియాడారు. మంచి విద్య అందించేందుకు విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సీ ఛానల్ ఎండీ రమేష్ మాట్లాడుతూ భవిష్యత్‌లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. క్లబ్ అధ్యక్షులు నల్లా సూర్యారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమ్ స్కూల్‌కు చెందిన రమాదేవి, రాకేష్ పబ్లిక్ స్కూల్ నుండి రమేష్‌కుమార్, భారత్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన వై షాలిని, భారతీ విద్యానికేతన్ నుండి జీ వరలక్ష్మీ, తదితరులను క్లబ్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు, ఆంధ్రా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్ రవీంద్రనాథ్, క్లబ్ కార్యదర్శి ఈశ్వరరావు, ట్రైజరర్ బీ సుబ్రహ్మణ్యం, జీ బాబురావు, సోమేశ్వరరావు పాల్గొన్నారు.