విజయవాడ

కోడెల మృతి జిల్లాకు తీరనిలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 16: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం కృష్ణా జిల్లాకు, టీడీపీకి తీరనిలోటని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. సోమవారం ఆయన కోడెల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కోడెల అనేక పదవులు అలంకరించి ప్రజలకు విశేష సేవలందించారని గుర్తుచేశారు. గుంటూరు జిల్లాలో ఏ ప్రజాపతినిధి చేయని అభివద్ధిని ఆయన చేసి చూపించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బచ్చుల తెలిపారు.

స్పందన సమస్యలకు తక్షణ పరిష్కారం
స్వీకరించిన అర్జీలకు రసీదు తప్పనిసరి * ఆర్డీవో చక్రపాణి స్పష్టీకరణ
విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 16: వివిధ సమస్యలపై ప్రజల నుండి స్పందన కార్యక్రమంలో వస్తున్న ఆర్టీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో ఎం చక్రపాణి తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే స్పందనలో ప్రజల నుండి తీసుకుంటున్న అర్జీలకు తప్పనిసరిగా రసీదు ఇస్తున్నట్లు చెప్పారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన అర్జీలను ఆర్డీవో స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల సైకిళ్ల కోసం ఎక్కువగా అర్జీలు అందిస్తున్నట్లు తెలిపారు. అర్జీల స్వభావాన్ని బట్టి ఆయా శాఖలకు పరిష్కారం కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. డివిజన్‌లో అర్హులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు పరిశీలించి అందుబాటులో ఉన్న భూమి వివరాలు అందిస్తున్నట్లు చెప్పారు.