విజయవాడ

27నుండి డీఎడ్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 16: డీఎడ్ 2వ సంవత్సరం 2017-2029 బ్యాచ్ పరీక్షలకు సంబంధించి మార్పు చేసిన టైమ్ టేబుల్‌ను సోమవారం ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈనెల 23నుండి జరగాల్సిన పరీక్షలు 27నుండి జరుగుతాయన్నారు. 27నుండి అక్టోబర్ 4వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు అన్ని ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు జరుగుతాయన్నారు. 27న పేపర్-1, 28న పేపర్-2, 30న పేపర్-3, అక్టోబర్ 1న పేపర్-4, 3న పేపర్-5, 4న పేపర్-6 జరుగుతాయన్నారు.
ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష దరఖాస్తుకు 30వ తేదీ ఆఖరు
ఎన్‌టీఎస్‌ఈ లేవేల్ -1 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30న ఆఖరు అని, పరీక్ష ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 1వ తేదీ అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పరీక్ష నవంబర్ 3వరకు జరుగుతుందని, వివరాలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కానీ వైబ్‌సైట్‌లో కానీ సంప్రదించాలన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష దరఖాస్తుకు 30వ తేదీ ఆఖరు
రాష్టస్థ్రాయి నేషనల్ మీన్స్ కమ్ మేరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30వతేదీ ఆఖరు అని, పరీక్ష ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 1వతేదీ అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పరీక్ష నవంబర్ 3వతేదీ వరకు జరుగుతుందని, వివరాలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కానీ వైబ్‌సైట్‌లో కానీ సంప్రదించాలన్నారు.

టీడీపీకి తీరనిలోటు
* కోడెల మృతిపై అవినాష్ సంతాపం
పటమట, సెప్టెంబర్ 16: నవ్యాంధ్ర శాసనసభ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. సోమవారం గుణదలలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంతాప సభలో కోడెల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ కోడెలతో దేవినేని నెహ్రూకు విడదీయరాని అనుబంధం వుండేదని గుర్తుచేశారు. కోడెల మృతిని కార్యకర్తలు జీర్ణిచుకోలేక పోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వెంకట సత్యనారాయణ, ఆళ్ళ చెల్లారావు, ముసునూరి సుబ్బారావు, అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.