విజయవాడ

భవానీపురం మోడల్ రైతుబజార్ అక్రమాల పుట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టంబర్ 18: భవానీపురం రైతుబజారులో కుటుంబ పాలన కొనసాగుతోందని, ఒకే కుటుంబంలోని ముగ్గురు, నలుగురికి రైతుబజారులో షాపులు కేటాయించి అధికారులు అక్రమ సంపాదనకు గేటులెత్తారు. ఇక్కడ పని చేసిన ఓ ఈఓ దండుకున్నంత దండుకుని అక్రమాలకు పాల్పడిన విషయం నేడు తెరపైకి వచ్చింది. షాపుల కేటాయింపుల్లో వేలాది రూపాయలు చేతుల మారాయని అక్కడి వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. దివ్యాంగుల కోటాలో 19షాపులుండగా వాటిల్లో బినామీలే వ్యాపారాలు సాగిస్తున్నారు. షాపుల్లోని వ్యాపారులు ఈ అవినీతిపై గగ్గోలు పెట్టగా నాటకీయంగా 10షాపులను క్రమబద్ధీకరించారు. కాలపరిమితి ముగిసినా మరో 9షాపుల్లో బినామీలే రాజ్యమేలుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. డబ్బు, పలుకుబడి ఉన్నవారు వ్యాపారాలు సాగిస్తున్నారేగాని రైతులు కొద్దిమంది మాత్రమే ఉన్నారని, ఎస్టేట్ ఆఫీసర్‌కి ఎవరు అనుకూలంగా ఉంటే వారి హవానే సాగుతుందని సాటి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కూరగాయల ధరలు కూడా వ్యాపారులు ఇష్టారాజ్యంగా బోర్డుకి సంబంధం లేకుండా అమ్ముతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. నాటి ఎమ్మెల్యే నేటి దేవాదాయవాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చొరవతో గట్టు వెనుక ప్రాంతవాసుల 20ఏళ్ల ఎదురుచూపు ఫలించింది. రైతుబజారు నిర్మాణం జరిగి ప్రారంభించిన అనంతరం రాజకీయ మార్పులు జరిగాయి. అనంతరం రైతుబజారు కొందరి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. మోడల్ రైతుబజారుగా రూపుదిద్దుకున్న తరువాత వ్యక్తుల ప్రాబల్యం పెరిగింది. అధికారులను రాజకీయంగా ఒత్తిడి తేలేకో చేతులు తడిపో కొందరు వ్యాపారులు మర్రి చెట్టులాగా అల్లుకుపోయారు. వారి మాటే శాసనంగా మారింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం మారిన తరువాతైనా కొందరికి న్యాయం జరుగుతుందని ఎదురుచూశారు. దానికి 100 రోజులు దాటినా రైతుబజారు విషయంలో తనదైన ముద్ర వేసుకున్న మంత్రి వెలంపల్లి దృష్టి సారించాలని లేకుంటే అక్రమాలకు అడ్డువేయలేరని వ్యాపారులే కోరుతున్నారు. ఓ కోడిగుడ్డు వ్యాపారి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ వ్యాపారాలు సాగిస్తున్నాడంటే అవినీతి అక్రమాలు ఏ మేరకు జరుగుతున్నాయో తేటతెల్లమవుతుంది. షాపులు కేటాయించాలంటే ఈఓకి రూ.10వేలు, అసిస్టెంట్‌కి రూ.2వేలు చొప్పున సమర్పించుకోవాల్సిందేనని నగదు చేజారినవారు వాపోతున్నారు. అయినా తమకు అనుకూలంగా షాపుల కేటాయింపులు జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణను వివరణ అడుగ్గా మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై తనిఖీలు నిర్వహిస్తానని, బినామీ షాపులపై దృష్టి సారిస్తానని వివరించారు.

సీవీఆర్ బ్రిడ్జి కింద
సబ్‌వేలో రాకపోకలు బంద్
విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 18: పాల ఫ్యాక్టరీ దగ్గరి సీవీఆర్ బ్రిడ్జి కింద సబ్‌వేలో రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రధాన మురుగు కాలువపై ఉన్న ఈ సబ్‌వేని గతంలో ఐరన్ దిమ్మలు, ఐరన్ రేకులతో నిర్మించారు. సుమారు పదేళ్ల పాటు వాహనాల రాకపోకలు సజావుగానే సాగింది. అయితే ఐరన్ లోడు మినీ వ్యాన్‌లు, ఇసుక ట్రాక్టర్లు, ఇటుక లారీలు కూడా ఈ దారెంట ప్రయాణం సాగించడంతో వాటి బరువుకి సబ్‌వే తాత్కాలిక వంతెన పక్కకి జరిగింది. రేకులు కుంగిపోయాయి. దాంతో గత 15రోజుల క్రితం ‘్భమి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఈసారి పక్కా సిమెంట్ వంతెన నిర్మాణం జరగనుంది. రేకులు, ఐరన్ దిమ్మెలు పూర్తిగా తొలగించారు. తొలుత కాలువలో సెంట్రింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. నిత్యం ప్రవహించే మురుగు కాలువలో సెంట్రింగ్ ఏర్పాటు ఎలాచేయాలో ప్రణాళిక రూపొందించడానికే వారం రోజులు పట్టింది. ఎట్టకేలకు ఈ వంతెనను పూర్తిగా తొలగించారు. కబేళా సెంటర్ నుండి ఈ వంతెన మీదుగా మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని రైల్వే పోలీసు స్టేషన్, రైల్వే అప్‌యార్డు, ఫోర్‌మెన్ బంగ్లా సెంటర్, నైజాంగేటు, పంజా సెంటర్‌కి వాహనాలు రాకపోకలు సాగించేవి. ముఖ్యంగా కేటీ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిన సందర్భాల్లో ఈ మార్గమే శరణ్యం. అందువల్ల కాంట్రాక్టురు నిబంధనల మేరకు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.