విజయవాడ

విద్య ద్వారానే మైనార్టీల సాధికారత సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 18: విద్య ద్వారానే ముస్లిం మైనార్టీల సాధికారత సాధ్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ‘విద్య ద్వారానే మైనార్టీల సాధికారత’ అంశంపై పొట్టి శ్రీరాములు చలవాది మల్లిఖార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఆ రంగాల ద్వారా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేందుకు కృషి చేస్తుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను కల్పించారన్నారు. అలాగే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాలను గత ప్రభుత్వం నీరు గార్చాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నామమాత్రంగానే ఉండటంతో మిగిలిన ఫీజులు చెల్లించలేక పేద, మధ్య తరగతి ప్రజానీకం ఉన్నత విద్యను దూరమయ్యారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. హిందూ హైస్కూల్ కమిటీ వందేళ్లుగా విద్యా సేవలు నిమగ్నమవటం అభినందనీయమన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ డైరెక్టర్ డాక్టర్ ఎండీ మస్తాన్ వలీ మాట్లాడుతూ దేశంలో దళిత వర్గాల కన్నా అట్టడుగున మైనార్టీలు జీవిస్తున్నారని సచార్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. ఆ అట్టడుగు వర్గాలకు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా అండదండలందిస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకుండా సివిల్స్ చదవటానికి, విదేశీ విద్యకు కూడా పలు పథకాలను మైనార్టీల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. ఆయా పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు చలవాది మల్లిఖార్జునరావు మాట్లాడుతూ విద్యారంగ వ్యాప్తి కోసం తమ హిందూ హైస్కూల్ కమిటీ విశేషంగా పాటుపడుతుందన్నారు. ప్రధానంగా కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళావాలలు ఉన్నత విద్యా వ్యాప్తి కోసం విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు వంకదార హేమచంద్రరావు, తూనుకుంట్ల శ్రీనివాసు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి కొత్తమాసు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు
నేడు నగరంలో పర్యటన

విజయవాడ, సెప్టెంబర్ 18: షెడ్యూ ల్డు కులాల జాతీయ కమిషన్ సభ్యు డు కే రాములు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆర్‌టీసీ చైర్మన్, డైరెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో స మావేశం అవుతారు. ఈ సందర్భంగా నగరంలోని ఏపీఎస్‌ఆర్‌టీసీలో పెం డింగ్‌లోని కేసులపై ఆయన చర్చిస్తా రు. అనంతరం మధ్యాహ్నం 2గంటల కు నగర పరిసర ప్రాంతాల్లో షెడ్యూ ల్డు కాస్ట్ గ్రామాలు, హాస్టల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు జిల్లాలో అట్రాసిటీ కేసులు, తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ, సాంఘిక సం క్షేమ అధికారులు, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం అవుతారు.