విజయవాడ

ప్రభుత్వ నిబంధనలననుసరించి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామకాల రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ప్రభుత్వ నిబంధనలననుసరించి నియామకాలు చేపడతామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ చెప్పారు. గ్రామ సచివాలయాల సిబ్బంది నియామకాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సెక్రటేరియట్ నుంచి గురువారం సాయంత్రం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై గోపాలకృష్ణ ద్వివేదికి కలెక్టర్ ఇంతియాజ్ వివరిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామకాల రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోగా పూర్తిచేసి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామకాల రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్లు తదితర అంశాల్లో ప్రభుత్వ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల విద్యార్హతలు, కులము, తదితర ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఇందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, పరిశీలన కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పరిశీలనను పూర్తి చేసి నిర్దేశిత సమయంలోగా వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికయ్యే అభ్యర్థులకు సంబంధించిన స్పోర్ట్స్‌ల్లో సాధించిన విజయాల్లో ఏ సర్ట్ఫికెట్ పరిగణనలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వం గతంలో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సదరు జీఓలోని మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఎంపిక చేయాలన్నారు. ఎవరైనా అభ్యర్థి ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో విఫలం చెందితే ఆ కేటగిరిలో తదుపరి అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింటు కలెక్టర్ కే మాధవీలత, జాయింటు కలెక్టర్ -2 మోహన్‌కుమార్, ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ చక్రపాణి, జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అరుణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.