విజయవాడ

కృష్ణావర్సిటీ క్రాస్ కంట్రీ చాంప్ ఏజీ అండ్ ఎస్‌జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 19: కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌ను ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల కైవసం చేసుకున్నారు. శుక్రవారం నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌ను అంతర్జాతీయ క్రీడాకారుడు మణికంధన్‌రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి కృష్ణా వర్సిటీ వైస్‌ఛాన్సలర్ వైకే సుందరకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా ఎన్ శ్రీనివాసరావు, టోర్నీ కార్యనిర్వహకకార్యదర్శి డా ఎన్ రాజు, కళాశాల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎన్ సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో ఎజీ అండ్ ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల ఉయ్యూరు ప్రథమస్థానం, ఆంధ్ర లయోల కళాశాల ద్వితీయస్థానం, డీఏఆర్ కళాశాల తృతీయస్థానం, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4వ స్థానం సాధించారు. మహిళల విభాగంలో ఏజీ అండ్ ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల ప్రథమస్థానం, శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ద్వితీయస్థానం, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తృతీయస్థానం, విజయ వ్యాయామవిద్య కళాశాల 4వ స్థానం దక్కించుకున్నారు.

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
కంకిపాడు, సెప్టెంబరు 19: విద్యాభివృద్ధికి సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి అన్నారు. మండలంలోని ఈడుపుగల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు వారు అందజేసిన 202 సైకిళ్ల విద్యార్థినీ విద్యార్థులకు ఆయన అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో పాటు సేవాసంస్థలు పేద విద్యార్థులకు సాయం అందించటం ఆదర్శనీయమన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక వసతులు, సేవా సంస్థల సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టీ సతీష్, ఎంపీడీవో కే అనూరాధ, ఎంఈవో కనకమహాలక్ష్మి, వైసీపీ నాయకులు తాతినేని పద్మావతి, పర్వతనేని కృష్ణారావు, దివీస్ లేబరేటరీస్ ప్రతినిధి రాజేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై ప్రత్యేక దృష్టిపెట్టండి
*ఎమ్మెల్యే గద్దె సూచన
పటమట, సెప్టెంబర్ 19: తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ చిన్న వంతెన సెంటర్, శాంతినగర్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పారుదల సమస్యలు వేధిస్తున్నాయని, అధికారులు, సిబ్బంది ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. గురువారం డివిజన్ల సమస్యలపై పర్యటనలో భాగంగా ఆయన 11వ డివిజన్ చిన్న వంతెన సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజాసమస్యలపై ఆరాతీశారు. ప్రధాన రహదారులు అంతర్గత వీధుల కంటే ఎత్తుగా ఉండటంతో చాలాచోట్ల యూజీడీ పారుదల లేక నీరు సైడ్ డ్రైన్లలోకి వచ్చేస్తోందన్నారు. దీంతో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీధుల్లో మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. స్థానికుల ఇబ్బందులు తెలుసుకొని, పొంగుతున్న మ్యాన్‌హోల్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. యూజీడీ సమస్య ఈప్రాంతంలో తీవ్రంగా ఉందన్నారు. ఈ వీధులను సిబ్బంది నిత్యం పరిశీలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పలుచోట్ల రహదారులు ఎత్తుపల్లాలుగా ఉన్నాయని, అలాంటిచోట్ల డ్రైనేజి పైపులు మార్చి నూతనంగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ సూచించారు. కార్యక్రమంలో గద్దె ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, డాంగేకుమారి, పేరేపి ఈశ్వర్, వీరంకి మునేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.