విజయవాడ

జిల్లా టాపర్లు వీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 19: వివిధ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం ప్రకటించారు. 19రకాల పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలను ఈనెల 1నుంచి 9వరకూ నిర్వహించారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీస అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30శాతంగా నిర్ణయించారు. ఫలితాలను గ్రామ సచివాలయ, ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. తరువాత జిల్లా యంత్రాంగం తెలియచేసిన తేదీల్లో సరిఫికెట్లను తనిఖీ చేయించుకోవాలి. జిల్లాలో వివిధ పోస్టుల్లో టాపర్లు ఇలా ఉన్నారు. కేటగిరి-2లో గ్రూప్ ఏ విభాగంలో 116 మార్కులతో ఏ సాయిదినేష్, 114 మార్కులతో ఎన్ కేశవకుమార్, 111 మార్కులతో ఏ శ్రీనివాసరెడ్డి, ఏఎన్‌ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్-3 విభాగంలో109.25 మార్కులతో ఏ సాయి అంజనా, గ్రూప్ బీ విభాగంలో109 మార్కులతో ఏ రాజశేఖరరెడ్డిలు టాపర్‌లుగా నిలిచారు. గ్రూప్ బీలో 108.5 మార్కులతో డీ వెంకట ఆనందరావు, గ్రేడ్-3లో 102.75 మార్కులతో కే సీత మహలక్ష్మీ, 102.25 మార్కులతో పీ రేవతి, గ్రేడ్-2లో 101.5 మార్కులతో వీ వరలక్ష్మీ, గ్రూప్ బీలో 105 మార్కులతో ఎన్ శ్రీకావ్య టాపర్‌లుగా నిలిచారు.