విజయవాడ

ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, అక్టోబర్ 9: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ వెటర్నరీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆరు రోజులపాటు జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శనను ఆయన మరో ఉప ముఖ్యమంత్రి చెరుకుపల్లి రంగనాధరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఒంగోలు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల్లో ఎడ్ల పందాలు భాగమన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల పశు పోషకుల్లో నూతనోత్సహం కలుగుతుందన్నారు. పోటీలు నిర్వహిస్తున్న యార్లగడ్డను ఆయన అభినందించారు. నవరత్నాల ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ , ఉప ముఖ్యమంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ ఒంగోలు జాతిని మించిన పశువులు ప్రపంచలోనే లేవన్నారు. మేలు జాతి పశు సంపద మన రాష్ట్రంలోనే ఉండేదని, ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో మేలైన ఒంగోలు జాతి పశువులు ఉన్నాయన్నారు. పోటీల నిర్వాహకుడు యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ తాత ముత్తాతల నుండి ఒంగోలు జాతి పశువులను పెంచడంతో పాటు ఎడ్ల పందాల్లో పాల్గొన్న సంగతిని గుర్తు చేశారు. 1972-73లో ఆయన పెదనాన్న మహానందిలో జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నారని చెప్పారు. ఒంగోలు జాతి ఆవును పెంచుకుంటే కిలో బంగారం ఉన్నట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటబాలవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాకు అగ్ర తాంబూలం
రెండు పళ్ళ విభాగంలో బండ లాగుడు పోటీల్లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరికి చెందిన తోట శ్రీనివాసరావు, పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెంకు చెందిన లేళ్ళ జానేంద్రరెడ్డి ఎడ్ల జత 4,049 అడుగులు దూరం బండ లాగి ప్రథమ స్థానం సాధించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్యచౌదరి ఎడ్ల జత 4,041 అడుగులు దూరం లాగి ద్వితీయ స్థానం సాధించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆతోట శివకృష్ణచౌదరి, అవనిగడ్డకు చెందిన మోదుగుమూడి వెంకటరాజగోపాలరావు ఎడ్ల జత 3902 అడుగుల దూరం లాగి తృతీయ బహమతి గెలుచుకుంది. విజేతలుగా నిలిచిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందచేశారు. తొలుత గో పూజతో ఈ పోటీలను ప్రారంభించారు.