విజయవాడ

దుర్గమ్మకు పసిడి కాసులపేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 14: శ్రీకనకదుర్గమ్మకు ఒక భక్తుడు 77 గ్రాముల తూకంతో పసిడితో తయారు చేయించిన 3ఆభరణాలను ఈవో ఎంవీ సురే ష్ బాబుకు అందచేశారు. గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన ఎం రాధాలక్ష్మీ దంపతులు సోమవారం అమ్మవారికి స న్నిధికి వచ్చి కాసుల పేరు, రెండు గా జులు, రెండుమంగళ సూత్రాలు సమర్పించుకున్నారు. వారికి ఆలయాధికారులు దర్శనం చేయించగా అర్చకులు దివ్య ఆశీస్సులిచ్చి ప్రసాదాలదించారు.

డయల్ యువర్ కమిషనర్‌లో 12 సమస్యలు
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 14: నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 12 సమస్యలను స్వీకరించారు. వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం ఉథయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ జరిగిన ఈకార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఫోన్ కాలర్స్ నుంచి నేరుగా సమస్యలను నమోదు చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌కు చెందినవి -3, ఇంజినీరింగ్ -4, ప్రజారోగ్యం -4, రెవెన్యూ -1 సమస్యలు ఫోన్‌లో వివరించారు. వీటిలో ప్రధానంగా గద్దె వెంకట్రామయ్య నగర్‌లో రోడ్ల అభివృద్ధి చేయాలని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్‌పై సైడ్ డ్రైన్ పొంగి మురుగునీరు ట్రాక్‌పైకి చేరడంతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవానీపురం స్వాతి రోడ్డు కెనరా బ్యాంక్ స్ట్రీట్‌లో రోడ్ల శుభ్రం, పారిశుద్ధ్య కార్మికులు గత 5రోజులుగా రాకపోవడంతో రోడ్లపై తాండవిస్తున్న అపరిశుభ్రత, ఐదో నెంబర్ రోడ్డులో ఐటీఐ బస్టాప్ వద్ద పొంగుతున్న డ్రైన్‌ను నివారించాలని, మధురానగర్ రైల్వే వారు ప్లాట్ ఫామ్ నిర్మాణ పనుల వలన డ్రైన్‌లో నీటి పారుదలక సక్రమంగా జరుగకపోవడం, తదితర సమస్యలపై నగర ప్రజలు ఫోన్ ద్వారా విన్నవించారు. ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుని పరిష్యరిస్తానని హామీ ఇచ్చిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రతి వారం జరిగే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో నగర ప్రజలు తాము ఎదుర్కొంటున్న వీఎంసీ సంబంధిత సమస్యలపై వివరించవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఈ మరియన్న, అదనపు కమిషనర్ యు శారద, ఎస్‌ఈ రామకృష్ణ, సిటీ ప్లానర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.