విజయవాడ

ఏపీ పోలీసు హౌసింగ్‌లో యువ ఇంజనీర్ల ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, అక్టోబర్ 14: కాలానుగుణంగా నిర్మాణ రంగంలో వస్తున్న ఆ ధునిక సాంకేతికతను అందింపుచ్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఏపీ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీ పీవీ సునీల్ కుమార్ (ఐపీఎస్) అన్నారు. మంగళగిరి ఏపీ డీజీపీ కార్యాలయం ప్రాంగణంలోని టెక్‌టవర్‌లోని ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌లో యువ ఇంజనీర్లగా ఉద్యోగ బాధ్యత లు నిర్వరిస్తున్న బొంతా అమర్ దీపక్, సీ లక్ష్మీప్రసన్న నిర్మాణ రంగంలో ‘కాం క్రీట్ కాన్వాస్ మల్టీ ఫెసిటెడ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌పై’ చేసిన పరిశోధన పత్రా న్ని సోమవారం అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థలో యువ ఇంజనీర్లగా బాధ్యతలు నిర్వహిస్తున్న బీ అమర్‌దీపక్, లక్ష్మీప్రసన్న కాంక్రీట్ కాన్వాస్‌పై నూతన పరిశోధనలు చేసి ఆధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. కాంక్రీట్ కాన్వాస్ అగ్ని నిరోధకంగా, వాటర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్‌గా అత్యంత సమర్థవంతగా ఉపయోగపడుతుందన్నారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇది వరకే పలు జిల్లాలోని పోలీసు స్టేషన్లు, హౌసింగ్ తదితర నిర్మాణాలలో ఈపీఎస్, ప్రీకాస్టింగ్, టెక్నాలజీలను ఉపయోగించటం జరిగిందన్నారు. ఈ యువ ఇంజనీర్ల ప్రతిభను, పరిశోధనను గుర్తించిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెంట్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అనే జర్నల్‌లో ప్రచురించటం తమ సంస్థకు గర్వకారణంగా నిలిచిందన్నారు. ఏపీ పోలీసు హౌసింగ్ చీఫ్ ఇంజనీరు ఎల్ శ్రీనివాసరెడ్డి, సూపరిటెండెంట్ ఇంజనీరు కామేశ్వరబాబు మాట్లాడుతూ తమ సంస్థ ఎండీ సునీల్ కుమార్‌తోపాటు, పోలీసు శాఖ కూడా యువ ఇంజనీర్లలైన బీ అమర్‌దీప్‌క్, లక్ష్మీప్రసన్నలను పరిశోధనలవైపు ప్రోత్సాహం, సహకారం అందించటం ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.